కుమారుడి పెళ్లి వేడుకలో భార్య డాన్స్ చేయడంతో భర్త దారుణం..!

ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలే దారుణ హత్యలకు కారణం అవుతున్నాయి.

ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి అనుమానాలు, ఎటువంటి గొడవలు లేకుండా ఉంటే సంసారం సాఫీగా సాగుతుంది.

అలా కాకుండా చిన్న కారణంతో మనస్పర్ధలు మొదలైతే ఇక కుటుంబం సర్వనాశనమే.ఇక భార్య మరొక వ్యక్తితో కాస్త చనువుగా మాట్లాడినా.

భర్త మరొక మహిళతో కాస్త చనువుగా మాట్లాడినా అసలు నిజాలు తెలుసుకోకుండా అక్రమ సంబంధాలు అంటగట్టడం, ప్రతిరోజు ఈ విషయం కారణంగా గొడవలు పడి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేయడం రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి.మనిషిలో అనుమానం మొదలైతే గొడవ పడడానికి పెద్ద కారణాలు అవసరం లేదు.

ఇలాంటి కోవకు చెందిన ఓ సంఘటన ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Advertisement

వివరాల్లోకెళితే.ఛత్తీస్ గడ్( Chhattisgarh ) రాష్ట్రంలోని కబీర్ ధామ్ జిల్లాలోని కవర్థ బంగౌరా గ్రామంలో తిన్హా బైగా అనే వ్యక్తి యొక్క కుమారుడి వివాహం ఇటీవలే జరిగింది.వివాహ వేడుకకు( Wedding ceremony ) వచ్చిన బంధువులు అంతా సంబరంగా డాన్సులు వేస్తూ సందడి చేశారు.

ఆ బంధువులతో కలిసి తిన్హా బైగా భార్య, ఇతని సోదరులు కూడా డాన్సులు వేస్తూ సందడి చేశారు.మద్యం మత్తులో ఉన్న తిన్హా బైగా తన భార్య బంధువులతో కలిసి డాన్స్ చేయడం చూసి ఆగ్రహంతో ఆమెపై దాడికి ప్రయత్నించాడు.ఇదంతా గమనించిన అతని సోదరులు వదినను కాపాడే ప్రయత్నం చేశారు.

ఇంతలో వారిని దారుణంగా హత్య చేసేసాడు.తరువాత అడ్డొచ్చిన బావపై కూడా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.

ప్రస్తుతం గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.నిందితుడు మాత్రం మంచం పై హాయిగా నిద్రపోయాడు.

ఓట్స్ ఆరోగ్యాన్నే కాదు హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.. ఇంతకీ ఎలా వాడాలంటే?
వైరల్ వీడియో : యువతి పక్కన ఉండడంతో రెచ్చిపోయిన వృద్ధ కామాంధుడు..

పోలీసులకు( Police ) సమాచారం అందించడంతో ఆ స్థలానికి చేరుకొని మృతుదేహాలను ఆసుపత్రికి తరలించి, నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.పెళ్ళికి వచ్చిన బంధువులు ఈ సంఘటనతో ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు