వైరల్: ఊరెళతానని చెప్పిన భర్త పెళ్లిమండపానికి వెళ్ళాడు... సీన్ సీతారంతే!

ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని చూశారంటే, వైరల్ వీడియోలలో ఈ వీడియో వేరయా అని అనక మానరు.అవును, కావాలంటే అర్జంటుగా ఇక్కడ వున్న వీడియోని తిలకించండి.

 Wife Catches Husband Marrying Another Woman Viral Video Details, Viral News, Vir-TeluguStop.com

అంతకంటే ముందుగా ఈ మేటర్ చదవండి.ఓ భర్త ( Husband ) ఆఫీస్ పనిపై ఊరు వెళ్తున్నానని, 3 రోజుల తర్వాత వస్తాను… జాగ్రత్తగా ఉండు అని తన భార్యకు ( Wife ) చెప్పి లగేజీ తీసుకుని బయలుదేరతాడు.

అయితే అప్పటికీ భర్త వ్యవహారశైలి పైన అనుమానం వున్న తన భార్య ఈ విషయమై ఆఫీస్ లో వాకాబు చేయగా తన భర్త 3 రోజులు లీవ్ పెట్టినట్లు తెలుసుకుంటుంది.

దాంతో హుటాహుటిన తన కుమారుడితో కలిసి భర్తను ఫాలో అవుతుంది.అతను కారులో వెళ్తూ వెళ్తూ ఓ కళ్యాణ మండపం వద్ద ఆగుతాడు.అప్పుడు భార్య తనకు తెలియకుండా పెళ్లికి వెళ్లాల్సిన అవసరం ఏముంది, తనకు తెలియకుండా పెళ్లికి ఎవరు ఆహ్వానించారు అని మనసులో అనుకుంటూ ఉండగానే ఆమెకు ఓ ఫ్లెక్సీ కనబడుతుంది.

దాంతో ఆమె గుండె గుభేలుమంటుంది.విషయం ఏమంటే ఆ ఫ్లెక్సీలో పెళ్లి కుమారుడి( Groom ) ఫొటో స్థానంలో ఆమె భర్త ఫొటో ఉంటుంది.దాంతో ఆమె వెంటనే పెళ్లి కొడుకు ఎవరని అక్కడున్నవారిని అడిగి ఫొటోలో ఉన్న వారే పెళ్లి కుమారుడని తెలుసుకొని వాడి భరతం పట్టాలని మండపంలోకి వెళ్తుంది.

ఇంకేముంది, సీన్ సీతారంతే.మండపానికి చేరుకున్న భార్య అమ్మాయి తరుపున వాళ్లతో పెళ్లి కొడుకు తన భర్త అని చెప్పి, తన దగ్గర వున్న బాబుని చూపించి తమ కుమారుడని మరీ వారికి రుజువు చూపిస్తుంది.దాంతో విషయం అర్ధం చేసుకున్న పెళ్లికూతురు తండ్రి కొత్త పెళ్ళికొడుకుని గదిలోకి తీసుకెళ్లి వారి రీతిలో మర్యాదలు చేస్తారు.

అంటే పెళ్లి కొడుకుని చితబాది పెళ్లిమండపం నుంచి బయటకు తరిమేస్తారు.కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్ష పైనే వ్యూస్ వచ్చాయి.ఈ ఘటన హైదరాబాద్ లో జరిగినట్లు వార్తలు వస్తున్నా.

ఎక్కడ జరిగిందో కచ్చితమైన సమాచారం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube