అమెరికా – మెక్సికో( America – Mexico ) సరిహద్దు వివాదం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు.యూఎస్‌లోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించాలనుకునే అక్రమ వలసదారులకు మెక్సికో సరిహద్దును గేట్ వేగా చెప్పుకుంటారు.
ఈ మార్గం గుండానే ఎంతోమంది నేరగాళ్లు అమెరికాలోకి ప్రవేశిస్తూ వుంటారు.ఇక సంఘ విద్రోహ శక్తులకు ఇది రాచమార్గం.
దేశ భద్రతకు పెను ప్రమాదం పొంచి వుండటంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ).మెక్సికో గోడను నిర్మించడంతో పాటు సరిహద్దుల వద్ద నిఘాను కట్టుదిట్టం చేశారు.
ఇప్పుడు ట్రంప్ అధికారంలో లేరు.దేశ సరిహద్దుల విషయంలో ఆయన వున్నంత దూకుడుగా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్( President Biden ) లేరంటూ రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలో యూఎస్- మెక్సికో సరిహద్దులోని టక్సన్ పోస్ట్‌పై ఇప్పుడు అందరి చూపు పడింది.అరిజోనాలో ఫ్లడ్ గేట్లను తెరవడంతో దేశంలోకి అక్రమ వలసలు పెరిగాయి.
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.యూఎస్ అధికారులు నీటి ప్రవాహం పెంచడానికి, అంతరించిపోతున్న జింకల వలసలకు సాయం చేయడానికి సరిహద్దు వెంబడి 114 ఫ్లడ్ గేట్లను తెరిచారు.

అయితే అధికారుల నిర్ణయం అక్రమ వలసదారుల నెత్తిన పాలు పోసినట్లయ్యింది.సగటున 1400 మంది వలసదారులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారని, వారిలో కొందరు చైనా మూలాలున్న వారేనని నివేదిక ప్రస్తావించింది.ఇక్కడ గస్తీ కాస్తున్న సిబ్బంది సంఖ్య తక్కువగా వుండటంతో వలసలను అడ్డుకోలేక చేతులెత్తేస్తున్నారు.ఈ పరిణామాలతో టక్సన్ పోస్ట్ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారితో రద్దీగా మారింది.
మానవ అక్రమ రవాణా గ్యాంగ్‌లు, ఇతర ముఠాలు సరిహద్దుల్లో వున్న లోసుగులను ఆసరాగా చేసుకుని పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులను యూఎస్‌కు చేరవేస్తున్నారు.

అమెరికా ప్రభుత్వం తెరిచిన 114 ఫ్లడ్ గేట్స్ ఒక్కొక్కటి 12 అడుగుల వెడల్పు వున్న తలుపులను కలిగి వున్నాయి.దీని గుండా వలసదారులు మోటార్ బైక్‌ను ఉపయోగించి సులభంగా చొరబడవచ్చని నివేదిక పేర్కొంది.నేషనల్ పార్క్ సర్వీస్, ఇంటర్నేషనల్ బౌండరీ అండ్ వాటర్ కమీషన్‌తో పాటు ఫెడరల్ ఏజెన్సీల సూచనల తర్వాత దాదాపు రెండు నెలల పాటు గేట్లు తెరిచి వుంచినట్లు నివేదిక వెల్లడించింది.
దీనికి తోడు వార్షిక వర్షాకాలం ఆలస్యంగా ప్రారంభం కావడాన్ని కూడా వలసదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు.







