ఎరుపు, నీలం, ఆకుపచ్చ... ఏ రంగు రైలు వేగంగా వెళుతుంది? 

మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు, రైలు కోచ్‌లు ఎక్కువగా ఎరుపు, నీలం ఆకుపచ్చ రంగులలో ఉండటాన్ని మీరు గమనించేవుంటారు.వాస్తవానికి, రంగుల నిర్ణయం వాటి రూపకల్పనపై ఆధారపడి ఉంటుంది.

 Why Train Coaches Are Of Red Blue And Green Details, Trains, Train Colors, Red C-TeluguStop.com

మనం రైలులో ప్రయాణించేటప్పుడు, రంగుల గురించి మన మనస్సులో అనేక ప్రశ్నలు వస్తాయి.రైలు కోచ్‌లు ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం ఈ మూడు రంగులలో ఉండటాన్ని గమనిస్తాం.

ఇంతేకాకుండా కొన్ని కోచ్‌లు బ్రౌన్ కలర్‌లో కనిపిస్తాయి.వీటిని చూశాక రైలు కోచ్‌లలో ఎక్కువగా ఈ రంగులే ఎందుకు ఉన్నాయి అని మీరు మనసులో అనుకొని ఉండవచ్చు.

అన్ని రైళ్లను భారతీయ రైల్వే నడుపుతున్నప్పుడు, అన్ని కోచ్‌లకు ఒకే రంగు ఎందుకు వేయలేదని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఈ విభిన్న రంగుల వెనుక కారణం ఏమిటి? వాస్తవానికి రైలు కోచ్‌ల రంగు, రూపకల్పన విభిన్న అర్థాలను కలిగి ఉంటుంది.కోచ్‌ల ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని వాటి రంగులు మరియు డిజైన్‌లు నిర్ణయించబడతాయి.

నీలం రంగు కోచ్‌లు సర్వసాధారణం.అవి చాలా రైళ్లలో కనపిస్తాయి.

ఈ కోచ్‌లను ఇంటిగ్రల్ కోచ్‌లు అంటారు.ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉంది.

Telugu Blue Coach, Color, Green Coach, Indian Railways, Rail Colors, Red Coach,

ఎరుపు రంగు కోచ్

ఎరుపు రంగు కోచ్‌లు ఎంతో ప్రత్యేకమైనవి.2000 సంవత్సరంలో జర్మనీ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు.ఎరుపు రంగు కోచ్‌లను లింక్ హాఫ్‌మన్ బుష్ (LHB) కోచ్‌లు అంటారు.ఇవి అల్యూమినియంతో తయారు చేయబడ్డాయి.మిగిలిన వాటి కంటే ఇవి తేలికగా ఉంటాయి.LHB కోచ్‌లతో కూడిన రైలు వేగం 160 kmph నుండి 200 kmph వరకు ఉంటుంది.

ఈ కోచ్‌లో డిస్క్ బ్రేకులు కూడా అమర్చబడి ఉంటాయి.రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలో ఈ కోచ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తారు.

ప్రస్తుతం పంజాబ్‌లోని కపుర్తలాలో వీటిని తయారు చేస్తున్నారు.

Telugu Blue Coach, Color, Green Coach, Indian Railways, Rail Colors, Red Coach,

ఆకుపచ్చ, గోధుమ రంగు కోచ్‌లు

గరీబ్‌రథ్‌లో గ్రీన్ కలర్ కోచ్‌లను ఉపయోగిస్తారు.మీటర్ గేజ్ రైళ్లలో బ్రౌన్ కలర్ కోచ్‌లను ఉపయోగిస్తారు.కోచ్‌లకు విభిన్న రంగులను మార్చడం అనేది ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు రైల్వేలు చేస్తున్న ప్రయత్నాల్లో భాగం.

సెంట్రల్ రైల్వేలోని కొన్ని రైళ్లు తెలుపు, ఎరుపు, నీలం తదితర రంగులలో కనిపిస్తాయి.ఇవి కొన్ని రైల్వే జోన్‌లు నిర్దేశిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube