పలు భాషల స్టార్స్ రావడం ఒకే కానీ కథలో వారికి స్థానం ఎక్కడ మంచు బాబు..?

భక్త కన్నప్ప( Bhaktha Kannappa ) కథ గురించి కొత్తగా మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు.నిజానికి ఒక ఆదివాసి యువకుడు శివుడిని ఎంతగా అభిమానించి ప్రేమిస్తాడో అంతగా అతడిలో ఐక్యం అవడం కోసం తన కళ్ళను తీసి దేవుడికి అర్పిస్తాడు.

 Why This Much Big Cast To Manchu Vishnu Bhaktha Kannappa Details, Manchu Vishnu,-TeluguStop.com

ఇదే అసలు కథ.దీనిని మార్చడం కుదరదు.దీనికి కాస్త లిబర్టీ తీసుకొని గతంలో బాపుగారు కృష్ణంరాజు( Krishnam Raju ) హీరోగా పెట్టి సినిమా తీశారు.అప్పట్లో అది పెద్ద సంచలనం.అందులో పాటలు మాటలు ప్రతీదీ హిట్టు.అయితే బాపు కాస్త లిబర్టీ తీసుకొని దాని చుట్టూ కాస్త రొమాన్స్, విలనిజం, హీరోయిజం వంటి ఎలివేషన్ ఇచ్చారు.

సినిమా అంటే ఆ మాత్రం లిబర్టీ ఉంటుంది.అందులో ఏమాత్రం తప్పులేదు.

ఏదైనా వెగటు పుట్టకుండా ఉంటే చాలు.

Telugu Akshay Kumar, Bhakta Kannappa, Kannappa, Manchu Vishnu, Manchuvishnu, Moh

అయితే 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా పేరు చెప్పి ప్రస్తుతం మంచు విష్ణు( Manchu Vishnu ) ఒక సినిమా తీస్తున్నాడు.చాలా రోజులుగా హిట్టు లేదు విష్ణుకి.పైగా భక్త కన్నప్ప లాంటి ఒక పెద్ద సినిమా చేయాలనుకోవడంలో తప్పులేదు.

కానీ మంచు ఫ్యామిలీ ఆలోచనలు ఎవరికి అర్థం కాకుండా ఉంటాయి.విశ్లేషణకు కూడా అందనంత రేంజ్ లో వారి ఐడియాస్ ఉంటాయి.

ప్రస్తుతం విష్ణు ఇంత భారీ ప్రాజెక్టు తీసుకొని దీనికోసం కన్నడ నుంచి శివరాజ్ కుమార్ ని,( Shivaraj Kumar ) తమిళ్ నుంచి శరత్ కుమార్,( Sarath Kumar ) హిందీ నుంచి అక్షయ్ కుమార్,( Akshay Kumar ) తెలుగు నుంచి శివుడి పాత్ర కోసం ప్రభాస్ ని( Prabhas ) ఎంచుకున్నారు.ఇక అనుష్క, నయనతార వంటి హీరోయిన్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఇంత పెద్ద హీరోయిన్స్ మధ్య ప్రీతి ముకుందన్ అనే ఒక చిన్న హీరోయిన్ ని కూడా తీసుకున్నారు.దీని వెనక లాజక్ ఏంటో ఎవరికి అర్థం కాదు.

ఇటీవల ఓం బీమ్ బుష్ అనే సినిమాలో కూడా ఈ అమ్ముడు కనిపించింది.

Telugu Akshay Kumar, Bhakta Kannappa, Kannappa, Manchu Vishnu, Manchuvishnu, Moh

ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ అసలు ఇంత మంది స్టార్స్ ఉండటానికి కథలో స్థానం ఎక్కడ అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిని తొలుస్తుంది.సినిమా హిట్ అవ్వాలంటే అన్ని భాషల స్టార్స్ అవసరం లేదు.కేవలం కథ మీద పట్టు ఉంటే చాలు.

మరి ఈ పరుచూరి బ్రదర్స్ లాంటి పాతవారిని కూడా ఇన్వాల్వ్ చేసి కథలో ఇంత మంది స్టార్స్ ని ఇమిడించేందుకు ఎన్ని కష్టాలు పడుతున్నారో మంచు వారు అర్థం కావడం లేదు.పైగా ఈ సినిమా కోసం మణిశర్మ అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ తప్ప మిగతావన్నీ కూడా తెలుగు నేటివిటికి సంబంధం లేకుండా ఉన్నాయి.

అసలు మన దగ్గర లేని అడవులా చెప్పండి? న్యూజిలాండ్ వరకు ఎందుకు వెళ్లారో అర్థం కావడం లేదు.మరోవైపు సినిమాటోగ్రఫీ వంటి వాటికోసం విదేశీయులపైనే ఆధారపడ్డారు.

చూడాలి మరి మంచు విష్ణు ఏ రేంజ్ లో అదిరిపోయే భక్తకన్నప్పని తీస్తాడో ? అది ఎంత మందిని మెస్మరైస్ చేస్తుందో ? మరో సన్నాఫ్ ఇండియా కాకుండా ఉండాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube