మరో నాలుగు రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ”భోళా శంకర్’( Bhola Shankar )ను మెహర్ రమేష్ డైరెక్ట్ చేసారు.
ఈ సినిమా తమిళ్ వేదాళం అనే సూపర్ హిట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.కాగా ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.
కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.దీంతో వరుస ప్రమోషన్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
ఇప్పటికే టీజర్, పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ లభించాయి.దీంతో ఈ సినిమాపై ప్రస్తుతం డీసెంట్ బజ్ అయితే నెలకొంది.

ఇక తాజాగా భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్నో విషయాలు హైలెట్ గా నిలిచాయి.అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవితో పాటు హీరోయిన్ కీర్తి సురేష్( Keerthy Suresh ) కూడా హాజరయ్యింది.కానీ మెయిన్ హీరోయిన్ తమన్నా( Tamannaah ) మాత్రం మిస్ అయ్యింది.
మరి ఈ ఈవెంట్ కు తమన్నా ఎందుకు రాలేదా అని అంతా అనుకున్నారు.

అందుకు కారణం ఇప్పుడు తెలుస్తుంది.ఆమెకు ముంబైలో ఒక ఈవెంట్ కరెక్ట్ గా ఇదే రోజు రావడంతో ఆమె అక్కడ హాజరు కావాల్సి వచ్చిందట.ముంబైలో మొట్టమొదటిసారిగా ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ఫ్లోరియన్ హురేల్ సెలూన్ ప్రారంభించాడు.
ఈ ఈవెంట్ కు ఈమె ముఖ్య అతిథిగా హాజరయ్యింది.దీంతో భోళా ఈవెంట్ కు ఈమె రాలేక పోయినట్టు తెలుస్తుంది.
ఇక ఈ ఈవెంట్ లో కూడా అమ్మడు బ్లాక్ కలర్ సూట్ లో మెరుపులు మెరిపించింది.








