కర్నాటకలో( Karnataka )వచ్చే నల 10న ఎన్నికలు జరగనున్నాయి.ఎలక్షన్స్ ఎంతో దూరంలో లేకపోవడంతో ప్రధాన పార్టీలన్ని తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.
కాగా ఈసారి కర్నాటక ఎన్నికలు బీజేపీ పార్టీకి( BJP party ) ఎంతో కీలకం ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆ పార్టీ.దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క కర్నాటకలో మాత్రమే అధికారంలో ఉంది.
కాబట్టి దక్షిణాదిన ఉన్న ఒక్క రాష్ట్రం చేజారిపోకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి.ఏ మాత్రం తేడా కొట్టిన దక్షిణాదిలో బీజేపీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది.
అందుకే కర్నాటక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు బీజేపీ పెద్దలు.

అయితే గ్రౌండ్ లెవెల్ లో పార్టీపై వ్యతిరేకత ఉందనే మాట వినిపిస్తోంది.ఈ వ్యతిరేకతను దాటుకొని అధికారం చేజిక్కించుకోవడం బీజేపీకి సవాలే.మరోవైపు కాంగ్రెస్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది.
అన్నీ వైపులా నుంచి కాంగ్రెస్ కు మద్దతు పెరుగుతుండడం, సర్వేలు కూడా కాంగ్రెస్( Congress ) కే పట్టం కడుతుండడంతో కాషాయ పార్టీకి ఈసారి కన్నడికులు షాక్ ఇవ్వబోతున్నారా అనే వాదన నడుస్తోంది.అయితే గెలుపుపై కమలనాథులు మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన గెలిచేది బీజేపీనే అని బల్ల గుద్ది చెబుతున్నారు.ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ కు కన్నడ ప్రజలు ఆకర్షితులౌతారనేది వారి భావన.
తాజాగా మాజీ సిఎం యడ్యూరప్ప( Former CM Yeddyurappa ) చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే కాషాయ పార్టీ విజయంపై ఎంత ధీమాగా ఉందో అర్థం చేసుకోవచ్చరు.

ఎన్నికల్లో తమ పార్టీ 125 – 130 స్థానాలు అలవోకగా గెలుస్తుందని, ఎవరి మద్దతు లేకుండానే అధికారం చేపడతామని యడ్యూరప్ప చెబుతున్నారు.మరి ఆయన చెప్పినట్లు నిజంగానే అన్నీ స్థానలు కైవసం చేసుకునే అవకాశం ఉందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.ప్రస్తుత కర్నాటక పరిస్థితులు చూస్తే బీజేపీకి అన్నీ సీట్లు రావడం కష్టమే అని కొందరి భావన.
ముఖ్యంగా హంగ్ ఏర్పడే ఛాన్స్ ఎక్కువగా ఉందమే మాట వినిపిస్తోంది.అయితే హంగ్ ఏర్పడితే ఇతర పార్టీనేతలను ఆకర్షించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విధ్య అందుకే ఎటొచ్చీ తమదే అధికారం అని కమలనాథులు కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
మరి వారి ధీమా ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.