పవన్ ని చూసి భయపడాల్సిన అవసరం మాకేంటి.?రెండు చోట్ల ఓడిపోయిన పవన్ అంటే మాకెందుకు భయం.పవన్, బీజేపీ, చంద్రబాబు కట్టగట్టుకుని వచ్చినా మాకు భయపడే అవసరం లేదు.త్వరలోనే జనసేన ని టీడీపీతో లంకి వేసేస్తావని మీ పార్టీ నేతలే భయపడుతున్నారు.
ప్రజల పల్లకి కాదు. చంద్రబాబు పల్లకి మోయడానికే జనసేన ఆవిర్భవించింది.2014 నుండి జనసేన నడక ప్రజలు అందరూ చూస్తున్నారు.2019 లో టీడీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకే ఒంటరిగా పోటీ చేసాడు.
వ్యతిరేక ఓట్లు చీలకుండా కాపాడి ఎవరిని సీఎం చేద్దాం అనుకుంటున్నావ్.సీఎం అయ్యేది నువ్వా.లేక చంద్రబాబుని సీఎం చెయ్యడానికా జనసైనికులకు చెప్పు.వ్యూహం నీకు వదిలేస్తే చంద్రబాబుతో లెక్కలు మాట్లాడుకుంటావా.2019 లోనూ వైసీపీ అధికారంలోకి రాదని పవన్ శపథం చేసాడు.జరిగిందా.2024 లోనూ వైసీపీ అధికారంలోకి రావడం సత్యం.నువ్వు రాసిపెట్టుకో.
పవన్ ఎప్పటికీ ఒకరి పల్లకి మోసే నాయకుడిగానే మిగిలిపోతాడు.