నోరు తెరిస్తా గేటు తెరవండి నాకు ఈ ఆట సెట్ కాదు, ఈ రాజకీయాలు నేను చేయలేను, ఈ ఆట ఆడటం నా వల్ల కాదు, గేటు తెరిస్తే నా ఇంటికి వెళ్ళిపోతా అంటూ బిగ్ బాస్ దత్త పుత్రుడు శివాజీ( Bigg Boss Shivaji ) ఈ మధ్య పదేపదే వ్యాఖ్యానాలు చేస్తున్న విషయం మీరంతా గమనించే ఉంటారు.నాగార్జునకు( Nagarjuna ) శివాజీపై ఇంత మమకారం ఏంటో తెలియదు కానీ అసలు ఎక్కడ సరిగ్గా ఆడటం చేతకాదు కూర్చుని డైలాగ్స్ కొట్టడం తప్ప మరొకటి తెలీదు అలాంటి శివాజీ చాలా చక్కగా ఆడాడు అంటూ కింగ్స్ మీటర్ ను గ్రీన్ లో పెట్టి బాగానే మెచ్చుకున్నాడు.
కానీ బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులకు చాలా బాగా తెలుసు.శివాజీ దారుణంగా ఆడుతున్నాడు, మరీ బద్దకస్తుడు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు.
అలాంటి వ్యక్తిని నాగార్జున ఎందుకు మెచ్చుకున్నాడు అర్థం కాని పరిస్థితి.
ఇక ఈ సీజన్ ఉల్టా పుల్టా…చాలా తేడా … ముందు సీజన్స్ కన్నా చాలా బాగా మెరుగయ్యాము అంటున్న నాగార్జునకు గట్టి షాక్ తగిలినట్టుగా రేటింగ్స్ ( Bigg Boss Ratings ) వస్తున్నాయి.రేటింగ్ మిషన్ లో పెద్దగా పొడిచింది ఏమీ లేదు.క్రియేటివ్ ఆలోచనలు కూడా పెద్దగా కనిపించడం లేదు.
అన్ని సీజన్స్ లాగానే చెప్పగానే సాగుతోంది.అయితే నాగార్జునకు ఫేవరెట్ గా హౌస్ లో ఉన్న శివాజీ పరిస్థితి చూస్తే చిరాకు వస్తోంది.
ఇక ఎవరు కూడా హౌస్ గేట్స్ తెరవండి నేను బయటికి వెళ్లిపోతా అంటూ అరిచాడు.ఈ విషయంలో యావర్ కి,( Prince Yawar ) శివాజీకి ఎలాంటి తేడా లేదు.
శివాజీకి పెత్తనం కావాలి .అందరిపై ఆదిపత్యం చేయాలననే కుతూహలం ఎక్కువ.
పెత్తందారీ పోకడ అందరిపై చూపిస్తూ ఉంటాడు.పైగా తాను చేసే ఆధిపత్యాన్ని తాను చక్కగా కన్విన్స్ చేసుకోగలడు అందరిని ఒప్పించగలరు.దానితో నాగార్జునకు శివాజీపై ఎక్కడలేని రాగద్వేషాలు బయటపడ్డాయి.ఇక శివాజీని తాజా ఎపిసోడ్లో సీక్రెట్ రూమ్ కి పంపించి షకీలాను( Shakeela ) ఎలిమినేట్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఏది ఏమైనా శివాజీని మరి కొన్ని రోజుల పాటు లేపే ప్రయత్నం గట్టిగానే సాగుతోంది.అందుకే నాగార్జునకు దత్తపుత్రుడుగా మారిపోయాడు శివాజీ.మరి ఇంకెన్నాళ్లు ఈ గరుడ పురాణం భరించాలో ఏంటో.?
.