బాలకృష్ణ సినీ ప్రస్థానంలో “సమరసింహారెడ్డి“( Samarasimha reddy ) చాలా ప్రత్యేకం.1997 లో “పెద్దన్నయ్య” విజయం తరువాత వచ్చిన పవిత్ర ప్రేమ, దేవుడు చిత్రాలు అనుకున్న స్థాయి విజయాలు సాధించలేదు.వరుస రెండు ప్లాప్ లతో సతమతమవుతున్న బాలకృష్ణకు సమరసింహారెడ్డి మళ్ళి ఊపిరి పోసింది.1999లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రోకార్డులను తిరగరాసింది.ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది బి.గోపాల్ గారు.లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి విజయాల తరువాత, వీళ్లిద్దరి కాంబో లో వచ్చిన మూడో చిత్రం సమరసింహారెడ్డి.ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం మరో ప్లస్ పాయింట్.
తెలుగు సినీ పరిశ్రమలో సమరసింహారెడ్డి ఫ్యాక్షన్ సినిమాలకు పునాది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

బాలకృష్ణ కెరీర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ ఐన సమరసింహారెడ్డి కథను నిజానికి బి.గోపాల్ ( B.Gopal )మరో హీరోకు వినిపించారట.ఆయన ఎవరో కాదు….
మన స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.ఐతే వెంకటేష్ కు ఈ కథ నచినప్పటికీ, ఫ్యాక్షన్ కథలు తనకు అంతగా సెట్ అవ్వవని ఈ కథను రిజెక్ట్ చేశారట వెంకటేష్.
అలాగే బాలకృష్ణ లాంటి మాస్ హీరో ఈ కథకు న్యాయం చెయ్యగలడని సలహా కూడా ఇచ్చారట.దాంతో ఈ సినిమా బాలకృష్ణ ఖాతాలో పడింది.
వెంకటేష్ అన్నట్టు గానే బాలకృష్ణ తనదయిన స్టైల్, స్వాగ్ తో ఈ కథను మరో స్థాయికి తీసుకువెళ్లారు.సమరసింహారెడ్డి పాత్రకు జీవం పోశారు బాలకృష్ణ.

ఇలా వెంకటేష్ ఒక ఇండస్ట్రీ హిట్ ని మిస్ చేసుకున్నాడు.ఇంతకీ వెంకటేష్( venkatesh )నిర్ణయం సరైనదేనా? అవుననే అంటున్నారు అభిమానులు.వెంకటేష్ కు ఒక ఫామిలీ హీరో ఇమేజ్ ఉంది.
అప్పట్లో ఆయన చేసిన సినిమాలన్నీ ఫామిలీ స్టోరీస్ అండ్ లవ్ స్టోరీస్.కలిసుందాం ర, సూర్యవంశం, రాజా వంటి సాఫ్ట్ స్టోరీస్ చేసే వెంకటేష్ ను ఒక ఫ్యాక్షన్ సినిమాలో ఊహించుకోవడం కాస్త కష్టమే.
దానికి ఉదాహరణ వెంకటేష్ నటించిన జయం మనదేరా చిత్రం.( Jayam Manadera ) ఈ చిత్రంలో వెంకటేష్ ఒక ఫ్యాక్షన్ నాయకుడిగా నటించారు.కానీ ఈ చిత్రం అనుకున్న విజయాన్ని సాధించలేదు.కనుక సమరసింహా రెడ్డి విషయంలో వెంకటేష్ తీసుకున్న నిర్ణయం సరైనదనే చెప్పాలి
.