ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో విడుదలై 5 రోజులైంది.వీక్ డేస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి.
భారీ మొత్తం ఖర్చు చేసి ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ఆర్ఆర్ఆర్ మూవీతో కళ్లు చెదిరే లాభాలు రావడం గ్యారంటీ అని అర్థమవుతోంది.అయితే సినిమాను చూసిన ప్రేక్షకులు కొన్ని సన్నివేశాలు ఎక్కడ? అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్లలో భాగంగా రామరాజు ఫర్ భీమ్, భీమ్ ఫర్ రామరాజు పేర్లతో టీజర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ టీజర్లలో కనిపించిన అద్భుతమైన షాట్స్ సినిమాలో కనిపించకపోవడంతో అభిమానులు షాకవుతున్నారు.
ఆ సీన్లు ఎక్కడ జక్కన్నా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కొందరు మాత్రం రాజమౌళి టీజర్ల కోసమే ఆ షాట్స్ ను షూట్ చేసి ఉండవచ్చని కామెంట్లు చేస్తున్నారు.

భీమ్ జెండా ఎత్తడం, సముద్రపు అలల పక్కన నిలబడటం, చరణ్ నిప్పు కాగడాతో రన్నింగ్ చేయడం, యోగా చేయడం, మరికొన్ని షాట్స్ మూడు గంటల నిడివి ఉన్న ఆర్ఆర్ఆర్ మూవీలో ఎంత వెతికినా కనిపించలేదు.ఆ షాట్స్ సినిమాలో ఉండి ఉంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇందుకు సంబంధించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్ల విషయంలో ఆర్ఆర్ఆర్ హీరోలతో పాటు ఫ్యాన్స్ సైతం సంతృప్తితో ఉన్నారు.బాహుబలి2 కలెక్షన్లను ఆర్ఆర్ఆర్ మూవీ బ్రేక్ చేయడం కష్టమేనని ప్రచారం జరుగుతుండగా ఫుల్ రన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.కొందరు మాత్రం జక్కన్న టీజర్లలో అద్భుతమైన షాట్స్ ను చూపించి సినిమాలో ఆ షాట్స్ లేకుండా తమను మోసం చేశారని కామెంట్లు చేస్తున్నారు.