బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.తను ఏం మాట్లాడిన ముక్కుసూటిగా మాట్లాడుతూ అవతల వారికి లెఫ్ట్ రైట్ ఇస్తుంది.
ఈ విధంగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు.ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా హాలీవుడ్ స్టార్ హీరో, ఆస్కార్ అవార్డు గ్రహిత విల్ స్మిత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కింగ్ రిచర్డ్ సినిమాకి విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ అవార్డు తీసుకున్న తర్వాత విల్ స్మిత్ యాంకర్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించడం హాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఈ విధంగా నటుడు విల్ స్మిత్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించడానికి కారణం ఏమిటని విషయానికి వస్తే.క్రిస్ రాక్ ఆస్కార్ అవార్డ్ వేదికపై భార్య గురించి హేళనగా మాట్లాడటం దీంతో ఆగ్రహం వ్యక్తం చేసి అతని చెంప పగల కొట్టాడు.
ఇలా కొట్టిన తర్వాత కూడా క్రిస్ రాక్ దీనిని ఎంతో స్పోర్టివ్ గా తీసుకున్నాడు.అయితే ఈ విషయంపై కంగనా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ జోక్ వేయడానికి ఏ ఇడియట్ అయినా తన తల్లి లేదా సోదరికి ఉన్న వ్యాధిని అడ్డుపెట్టుకొని హేళనగా చేసి మాట్లాడితే తాను కూడా విల్ స్మిత్ లాగే ప్రవర్తిస్తానని తెలిపారు.ఇక విల్ స్మిత్ కేవలం చెంపదెబ్బ వరకు మాత్రమే సరిపెట్టుకున్నాడు ఆస్థానంలో నేను కనుక ఉంటే గట్టిగా తన్నేదాన్ని, ఇలాంటి వాళ్ళని అస్సలు వదిలి పెట్టకూడదు.క్రిస్ రాక్ తన రియాలిటీ షో లాకప్ కార్యక్రమానికి వస్తారని ఆశిస్తున్నాను అంటూ ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా కంగనా రాసుకొచ్చారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.








