Puri Jagannath Ram Gopal Varma: పూరి జగన్నాథ్, RGV ఇంటర్వూస్ బాగుంటాయి, సినిమాలు ఎందుకు బాగోవు ?

అవును… మీకు కూడా నాలానే అనిపిస్తుందా ? ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ అయినా పూరి జగన్నాథ్ అయినా కూడా వీరి ఇచ్చే ఇంటర్వూస్ కానీ వేరు మాట్లాడే మాటలు కానీ విన్నా కొద్దీ వినాలని అనిపిస్తుంది.ఎంతో వినసొంపుగా అనిపించే వీరి మాటల్లో నిజం, నిజాయితీ ఖచ్చితంగా కనిపిస్తుంది.

 పూరి జగన్నాథ్, Rgv ఇంటర్వూస్ బాగ-TeluguStop.com

మనం ఎందుకు ఆలా లేము అని మనల్ని మనమే నిందించుకుంటాం.అంతలా వీరి మాటలు జనాలను అట్ట్రాక్ట్ చేస్తాయి.

అయితే మరి మాటలు, ఇంటర్వూస్ బాగున్నట్టు వీరి సినిమాలు ఎందుకు బాగోవు అనే ప్రశ్న చాల మందికి వస్తుంది.ఈ మధ్య ఈ ఇద్దరు దర్శకులు తీసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్న విషయం మన అందరికి తెలిసిందే.

ఎందుకంటే కొంత మంది రచయితలు, కళాకారులకు జీవితంలో చాల అమాశాలపై స్ప్రష్టమైన అభిప్రాయం ఏర్పడుతున్న కొద్దీ నార్మల్ జనాలకు దూరం అవుతారు.సమాజం సృష్టించిన నియమాలు, నిర్దేశిత విలువలను వీరు పట్టించుకోరు.

వీరికంటూ ఉండే సొంత అభిప్రాయాలతో, కొన్ని సొంత నిర్వచనాలతో ప్రపంచాన్ని చూడటం అలవాటు చేసుకుంటారు.ఇలా చూస్తూ పోతే ప్రతిదీ కొత్తగా కనిపిస్తూ ఉంటుంది.

దాంతో జనల మధ్య ఉండటం కన్నా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతూ ఉంటారు.ఏకాంతంలో ఎంతో ఆనందం, అభివృద్ధి ఉందని నమ్ముతారు.

Telugu Puri Jagannath, Ram Gopal Varma, Flop, Purijagannath-Movie

అలాంటి వారు అంతరంగికంగా చాల ఎదిగినట్టుగా ఉంటారు.ఇది కళాకారుల్లో మరింత ఎక్కువ.లోకంలో ఉన్న జనరలైజ్డ్ ఒపీనియన్స్, విలువలు, వ్యవహారాల వంటి వాటిల్లో వీరికి చాల అభ్యంతరాలు ఉంటాయి.మకిలి పట్టిన ప్రజలకు ఇంకొక కోణం చూపించాలని భావించి విధంగా మాట్లాడుతుంటారు.

జీవితంలో ఎదుర్కొనే అనుభవాలను బట్టి వీరి మాటల తీవ్రత ఉంటుంది.ఇలాంటి మనుషుల్లో సృజనాత్మకత పెరగొచ్చు, లేదంటే ఎవరిని లక్ష పెట్టని ఒక కేర్ లెస్ ధోరణి బాగా కనిపిస్తూ ఉంటది.

ఈ రెండో రకం లో నే పూరి జగన్నాథ్ మరియు రామ్ గోపాల్ వర్మ వస్తారు.అందుకే వీరి మాటలు చాల బాగుంటాయి కానీ వీరి సినిమాలే ఫ్లాప్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube