ఆనిమల్.( Animal Movie ) ఈ సినిమా విడుదల అయినా రోజు నుంచి అనేక చర్చలకు తావు ఇస్తుంది.
సినిమా అంటే బోల్డ్ కంటెంట్ లేదా వాయిలెన్స్ అనే పద్దతిగా సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) తన చిత్రాన్ని తీర్చిదిద్దాడు.సినిమా లో నటించిన అన్ని పాత్రలు కూడా దాదాపు అలాగే ఉన్నాయ్.
అయితే మొదట్లో అందరికి ఒక రేంజ్ సినిమాగా అనిపించినా రాను రాను దీన్ని ద్వేషించే వారు పెరిగిపోతూ ఉన్నారు.మరి ఆనిమల్ సినిమాను ప్రేక్షకులు ద్వేషించడానికి గల ఆ కారణాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మేల్ ఆధిపత్యం
సినిమా మొత్తం రష్మిక పై( Rashmika ) లేదా ఆడవారిపై మొగవారి ఆధిపత్యం చాల స్ప్రష్టంగా కనిపిస్తుంది.అలాగే రష్మిక మరియు రణబీర్ బంధం లో కూడా హీరో డామినేషన్ ఉంటుంది.
ఇది సమాజం పై చెడు ప్రభావాన్ని చూపే అవకాశం చాల ఉంటుంది.
ఇద్దరు లీడర్ల మధ్య పోరు
చాల ఏళ్లుగా ఇద్దరు లీడర్ల మధ్య జరుగుతన్న పోరాటాన్ని మళ్లి సందీప్ రెడ్డి చూపించాడు కానీ కొత్తగా ఇందులో చూపించింది ఏమి లేదు.
మితిమీరిన వాయిలెన్స్
సినిమాలో మితిమీరిన వాయిలెన్స్ కూడా ఒకరకంగా జనాలకు సర్ప్రైజ్ గాను షాకింగ్ గాను కనిపించింది.ఈ విషయం పై అనిల్ కపూర్( Anil Kapoor ) కూడా తన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు.
మహిళలపై వివక్ష
‘అర్జున్ రెడ్డి’( Arjun Reddy ) మరియు ‘కబీర్ సింగ్’( Kabir Singh ) వంటి వివాదాస్పద చిత్రాలకు పేరొందిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ‘ఆనిమల్’లోను మహిళల పట్ల గౌరవం చూపించకపోవడం తో అందరు ఈ సినిమాపై నిప్పులు చెరిగారు.సెక్సిజం కి కేరాఫ్ అడ్రస్ గా ఈ సినిమా విస్తృత చర్చకు దోహదపడింది.
వెండితెరపై నీచమైన వాదనలు
‘యానిమల్’లో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) పాత్ర విషపూరితమైన మగతనం లక్షణాలను సూచిస్తుంది.అతని భార్య యొక్క శరీరం పై అతను చేసిన వ్యాఖ్యలలో ఇది స్పష్టంగా తెలుస్తుంది.
ఆ టైం లో హీరోయిన్ నిశ్శబ్ధంగా ఉండటం అంటే సందీప్ ఎలాంటి సందేశం జనాలకు ఇవ్వాలనుకుంటున్నాడు.
నిజాయితీని క్షమించడం
‘ఆనిమల్’ సినిమాలో ప్రత్యేకించి వివాదాస్పద ప్లాట్ పాయింట్ ఏంటంటే, రణబీర్ పాత్ర వివాహేతర సంబంధాలలో నిమగ్నమై ఉంటుంది.రణబీర్ కేవలం తన తండ్రి యొక్క దాడిని బహిర్గతం చేయడానికి మాత్రమే ఉపయోగపడింది.