నివేదా థామస్( Nivetha Thomas ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చాలా క్యూట్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ నాని హీరోగా నటించిన జెంటిల్మెన్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యింది.
తర్వాత నిన్ను కోరి సినిమాలో నటించింది.ఈ ఎమోషనల్ రొమాంటిక్ సినిమాలో నివేదా మంచి వెయిట్ ఉన్న పాత్ర చేసింది.
అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించి ప్రేక్షకుల మనసులు దోచేసింది.తర్వాత “జై లవకుశ” సినిమాలో( Jai Lava Kusa ) జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి మెప్పించింది.
ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలేవీ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.నిజానికి ఈ తార స్టార్ హీరోల సరసన సినిమా అవకాశాలను పెద్దగా అందుకోలేకపోయింది.

చూసేందుకు ఈ చెన్నై బ్యూటీ కాస్త హైట్ తక్కువైనా చాలా అందంగా, మంచి ఫిజికల్ ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.కానీ కెరీర్ తొలినాళ్లలో లాగా కాకుండా కొన్నేళ్ల తర్వాత ఈ తార కాస్త బొద్దుగా తయారైంది.నిజానికి జై లవకుశ సినిమా నుంచి ఈ తార లావుగా తయారవడం మొదలయ్యింది.బొద్దుగా తయారు కావడం వల్ల ఆమె తన స్కిన్ షో కూడా పెద్దగా చేయలేకపోయింది.
బొడ్డు అందాలను ఎక్స్‌పోజ్ చేయలేక చాలా సినిమా అవకాశాలను కోల్పోయింది.లేడీ ఓరియంటెడ్ సినిమాగా వచ్చిన “శాకిని డాకిని( Saakini Daakini )”లో నివేదా థామస్ మరింత లావెక్కి కనిపించింది.
ఇదే ఆమెకు పెద్ద మైనస్ అయినట్లు తెలుస్తోంది.అందుకే ఈ మూవీ తర్వాత తెలుగులో ఒక అవకాశం కూడా ఆమెకు రాలేదు.

మలయాళంలో ఒక సినిమా చేసింది కానీ అది సూపర్ డూపర్ ప్లాప్ అయ్యింది.ఒకప్పుడు సంవత్సరానికి కనీసం రెండు నుంచి మూడు వరకు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఒక్క అవకాశం కూడా చేతిలో లేక సతమతమవుతోంది.వాస్తవానికి ఈ క్యూట్ హీరోయిన్ వయసు ప్రస్తుతం 28 ఏళ్లే.ఇప్పటికైనా కాస్త సన్నగా తయారయ్యి ఫిట్నెస్ పై దృష్టి పెడితే ఈ ముద్దుగుమ్మ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశం ఉంది.లేదంటే కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది.నివేదా థామస్ 2008 నుంచి బాలనటిగా నటించడం ప్రారంభించింది.
ఒకానొక కాలంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ కూడా దక్కించుకుంది కానీ దానిని ఆమె నిలబెట్టుకోలేకపోయింది.ఏ హీరోయిన్ చెయ్యని తప్పు చేసి చేజేతులా కెరీర్ నాశనం చేస్తుంది.








