తెలుగు సినీ ప్రేక్షకులకు నటి నదియా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది 2013లో వచ్చిన మిర్చి సినిమా, అదే ఏడాదిలో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది సినిమా గుర్తుకు వస్తుంది.
మిర్చి సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన నదియాని చూడగానే చాలామంది ఫిదా అయ్యారు, ఆ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన అనుష్క,రిచా ఇద్దరి కన్నా కూడా నదియానే బాగుందనే కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి.అదే ఏడాది పవన్ చిత్రం అత్తారింటికి దారేదిలో పవన్ అత్తగా నటించి తన అందంతో, నటనతో మార్కులు కొట్టేశారు.
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో నదియా కూడా ఒకరు.సినిమాలలో అత్తా, అమ్మ పాత్రలో ఆమె నటిస్తూ అదరగొడుతున్నారు.
ప్రస్తుతం సినిమాలో సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ కేరిర్ పరంగా దూసుకుపోతున్నారు.మొదటిసారిగా 1984 లో మలయాళ సినిమాలో మోహన్ లాల్ సరసన నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళ సినిమాలలో నటించింది.
ఈ క్రమంలోనే ఒకసారి టాలీవుడ్ స్టార్ హీరో అయినా మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం నదియాకి వచ్చింది.

కే మురళీ మోహన రావు దర్శకత్వంలో 1990లో చిరంజీవి హీరోగా నటించిన కొదమసింహం అనే సినిమా తెరకెక్కింది.ఇక అప్పుడు కౌబాయ్ సినిమాలు బాగా ప్రచారంలో ఉండగా చిరంజీవితో కౌబాయ్ సినిమా తీయాలి అనే ఆలోచన నిర్మాత నాగేశ్వరరావు కు వచ్చిందట.అందుకు చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
అలా ఆ సినిమా దాదాపు నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే మొదటిగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం ముగ్గురిని తీసుకున్నారు.

అందులో రాధ, వాణి విశ్వనాథ్, నదియా ఉన్నారు.ఇక ఇందులో వాణి విశ్వనాథ్ గెస్ట్ రోల్ లో నటించింది.ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా నదియా అని అనుకున్నప్పటికీ ఆమెకు అప్పటికే పెళ్లి అయింది.అయినా కూడా నిర్మాత నాగేశ్వరరావు ఆమెను ఈ సినిమా చేయమని ఒప్పించి నప్పటికీ, చిరంజీవి డేట్స్ కి ఆమె డేట్స్ కి కుదరకపోవడంతో ఆ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారు.
ఇక ఆమె స్థానంలో బాలీవుడ్ నటి అయిన సోనం ను తీసుకున్నారు.ఇక రాధ ను మెయిన్ హీరోయిన్ గా చేశారు.