ప్రేమించుకుందాం రా, చూడాలని వుంది, సమరసింహ రెడ్డి వంటి సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించి మెలోడీ బ్రహ్మ, స్వర బ్రహ్మగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు మణిశర్మ.( Music Director Manisharma ) ఇప్పుడు ఆయన వయసు 60 ఏళ్లు.
ఈ వయసులో కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు.రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్( iSmart Shankar Movie ) సినిమాలో అదిరిపోయే సంగీతం కొట్టి ఇప్పటికీ తాను అదిరిపోయే సంగీతం ఇవ్వగలనని నిరూపించాడు.2024లో డబుల్ ఇస్మార్ట్, కన్నప్ప సినిమాలకి సంగీతం సమకూరుస్తున్నాడు.అయితే తమన్, దేవి శ్రీ ప్రసాద్‌కు వచ్చినన్ని సినిమాలు అతనికి రావడం లేదు.
దాంతో అతను తనకు మ్యూజిక్ బాధ్యతలను ఇవ్వాలని ఇండస్ట్రీలో చాలామంది స్టార్లను బతిమిలాడుతున్నాడు.
నిజానికి తమన్,( Thaman ) దేవి శ్రీ ప్రసాద్( Devisri Prasad ) కంటే మణిశర్మ ప్రతిభావంతుడు.
వారు మణిశర్మ వద్ద శిష్యరికం చేసి నేడు అతనికి ఛాన్సులు రాకుండా అన్ని వారే తన్నకు పోతున్నారు.తమన్ మరీ ఘోరం అని చెప్పుకోవచ్చు.
అతడు వేరే మ్యూజిక్ డైరెక్టర్లు కొట్టిన ట్యూన్స్ కాపీ( Copied Tunes ) చేసి మరీ హిట్స్ కొడుతున్నాడు.అతడు చేసే ట్యూన్స్ అన్నీ కాపీ అని ఎప్పటికప్పుడు నెటిజన్లు యూట్యూబ్ వేదికగా బహిర్గతం చేస్తున్న అతడికి ఎక్కువ అవకాశాలను సినిమా దర్శకులు ఇవ్వడం విస్తు గొలిపే అంశం.
దేవి శ్రీ ప్రసాద్ కూడా నాసిరకమైన సంగీతమే అందిస్తున్నాడు.
వీరికి బదులు మణిశర్మని సెలెక్ట్ చేసుకుంటే సినిమాల మ్యూజిక్ మరింత హిట్ అయ్యే అవకాశం ఉంది.చిరంజీవి లాంటి వారు ఆచార్య వంటి సినిమాలకు మణిశర్మను తీసుకున్నారు కానీ మహేష్ బాబు,( Mahesh Babu ) రామ్ చరణ్,( Ram Charan ) అల్లు అర్జున్,( Allu Arjun ) పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వంటి హీరోలు మాత్రం మణిశర్మకు ఛాన్స్ ఇవ్వడం లేదు.ఒకప్పుడు వీరందరికీ మ్యూజికల్ హిట్స్ ఇచ్చింది మణిశర్మనే, అలాంటి మేటి మ్యూజిక్ డైరెక్టర్‌ను మర్చిపోయి కాపీ క్యాట్స్‌కు మ్యూజిక్ బాధ్యతలను ఇవ్వడం నిజంగా బాధాకరం.
మణిశర్మకు టాలీవుడ్ లో తప్ప వేరే ఇండస్ట్రీలలో పెద్దగా పరిచయాలు లేవు.
అతను ఇతర భాషా సినిమాలకు మ్యూజిక్ కొట్టనూ లేదు.అందువల్ల టాలీవుడ్ పైనే ఆధారపడాల్సి వస్తోంది.ఒక్క స్టార్ హీరో ఇప్పుడు మణిశర్మకు ఛాన్స్ ఇస్తే అతడు తనను తాను నిరూపించుకోగలడు.
మంచి హిట్ కొట్టి పాన్ ఇండియా వైడ్‌గా పేరుతో పాటు సినిమా అవకాశాలను పొందగలడు.కానీ ఎవరూ కూడా అందుకు ఆసక్తి చూపడం లేదు.కనీసం పవన్ కళ్యాణ్ అయినా భవిష్యత్తులో ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది.