నట సార్వబౌముడు అయిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకి వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజని కాంత్( Rajinikanth ) చంద్రబాబుని ప్రశంసించడం .దానికి వైసీపీ కౌంటర్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది…పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ నీతులు చెబితే వినే స్థితిలో తాము లేమంటూ రజినీపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
రజినీని విమర్శించిన వారిలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నారు.రజినీని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శలు చేస్తుంటే.
అయన ఫ్యాన్స్ , టీడీపీ నాయకులు మద్దతుగా నిలిచారు.అయితే ఈ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎవరూ స్పందించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
రజినీకాంత్ పై విమర్శలు చేసినందుకుగాను, ఆయనకు వైకాపా నేతలు క్షమాపణలు చెప్పాలంటూ అభిమానులు ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.రజిని ఎవరినీ కించపరచనప్పటికీ అలా ఎలా ట్రోల్ చేస్తారని ప్రశ్నించారు.
చంద్రబాబు( Chandrababu Naidu ) కూడా సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.జగన్ ప్రభుత్వంపై రజనీ చిన్న విమర్శ చేయకపోయినా, వైఎస్సార్‌సీపీ ఆయనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు .సమాజంలో ఎంతో గౌరవం ఉండే లెజెండరీ పర్సనాలటీపై ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం బాధ కలిగిస్తుందని అన్నారు.అయితే రజినీపై ఇంతగా ట్రోల్స్ చేస్తున్నా .ఆయన ప్రియ మిత్రుడని అని చెప్పుకునే మోహన్ బాబు( Mohan Babu ) స్పందించక పోవడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు .
రజినీకాంత్ కు మోహన్ బాబు కి మధ్య ఎన్నో ఏళ్ళ నుంచి మంచి అనుబంధం కొనసాగుతోంది.తమ మధ్య ఫ్రెండ్ షిప్ గురించి ఇద్దరూ అనేక సందర్భాల్లో వెల్లడించారు.ఇప్పుడు రజినీపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నా, మోహన్ బాబు మాత్రం స్పందించలేదు.
ఈ నేపథ్యంలో తన స్నేహితుడికి మోహన్ బాబు ఎందుకు సపోర్ట్ గా నిలవలేదని.అలా మౌనంగాగా ఉండటంలో అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు.తన స్నేహితుడిని అంత దారుణమైన మాటలు అంటుంటే ఆయన ఎలా తట్టుకోగలుగుతున్నారని అంటున్నారు.
ఈ విషయంపై మాట్లాడితే, పరోక్షంగా జగన్ ప్రభుత్వంపై వైసీపీ నాయకులపై కామెంట్స్ చేసినట్లు అవుతుందని నిశబ్దంగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు.మిగతా సినీ ప్రముఖులు సైతం ఈ కారణం చేతనే రజినీ కాంత్ వ్యవహారంలో స్పందించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఇదే క్రమం లో కొందరు మోహన్ బాబు చాలా స్వార్థ పరుడు ఆయన సినిమాలు హిట్ అవ్వడానికి రజిని పేరు వాడుకునే పాడిన మోహన్ బాబు ఇలా రజిని ని ట్రోల్స్ చేస్తున్నప్పుడు మాత్రం స్పందించక పోవడం ఆయన ఎంత స్వార్థపరుడో తెలియజేస్తుంది అని అంటున్నారు…
.