నాగబాబు సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే..?

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లో ఎంత పెద్ద స్టార్ హీరోనో మనందరికీ తెలుసు అయితే అప్పట్లో చిరంజీవి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే నాగబాబు ఒక టైం తరువాత తాను కూడా హీరో గా చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసి చిరంజీవి తనని హీరోగా చేసి కొన్ని సినిమాలు తీయించారు.కానీ ఆయన హీరోగా చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు దాంతో ఆయన కెరియర్ హీరోగా సక్సెస్ కాలేకపోయింది దింతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు నాగబాబు…అయితే ఆయన హీరోగా సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే మెగాస్టార్ తమ్ముడు అనే ఒక భారీ ఇమేజ్ ఉండడం వాళ్ళ ఆయన ఆ అంచనాల మధ్య నిలబడ లేక పోయారని చెప్పాలి…

 Why Mega Brother Nagababu Career Not Successful Details, Nagababu, Mega Brother-TeluguStop.com

ఇక యాక్టర్ గా ఆయనికి పెద్దగా స్కోప్ లేదు అని తెలుసుకున్న ఆయన ప్రొడ్యూసర్ గా కూడా మారి గుడుంబా శంకర్, స్టాలిన్, ఆరెంజ్ లాంటి సినిమాలు తీసి దాంట్లో కూడా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి ఇక మల్లె మాల వాళ్ళు నిర్వహించే జబర్దస్తు షో కి జడ్జ్ గా వెళ్లి ఆ షో సక్సెస్ లో కీలక పాత్ర వహించారని చెప్పాలి…అయితే అక్కడ కూడా జరిగిన కొన్ని గొడవల కారణం గా ఆయన అక్కడి నుంచి కూడా బయటకి వచ్చేసి ప్రస్తుతం ఖాళీ గా ఉంటున్నాడు.ప్రస్తుతం వాళ్ళ తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన లో మెంబర్ గా ఉంటూ ఆపార్టీ రాజకీయాల్లో కీలక వ్యక్తి గా మారారు…

ఇక నాగ బాబు కొడుకు అయినా వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే తాను ఫిదా, తొలిప్రేమ లాంటి హిట్ సినిమాలు తీసి ఇండస్ట్రీ లో మంచి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.నాగబాబు సినిమాల్లో హీరోగా సక్సెస్ కాకపోయినా వాళ్ళ అబ్బాయి అయిన వరుణ్ హీరోగా మంచి సినిమాలు చేస్తూ నాగబాబుకి దక్కని ఆ హీరో అనే టాగ్ ని తగిలించుకొని సక్సెస్ ఫుల్ గా మోస్తున్నాడు…

 Why Mega Brother Nagababu Career Not Successful Details, Nagababu, Mega Brother-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube