గుంటూరు కారం సినిమా పేరు ఎందుకు పెట్టారో తెలుసా..?

కొన్ని సినిమాకి టైటిల్స్ గా ఈ పేరు పెట్టిన నడుస్తాయి మరింకొన్ని సినిమాలకి కథలని బట్టి పేర్లు పెడ్తారు ఇంకొన్ని సినిమాలకి మాత్రం హీరో ఇమేజ్ ను బేస్ చేసుకొని పేర్లు పెడుతూ ఉంటారు…అందులో భాగం గా పెట్టిన పేరే RRR రాజమౌళి రామ్చరణ్ రామారావు అని ముగ్గురు పేర్లు వచ్చేలా వీళ్ళ ముగ్గురి కాంబో లో సినిమా అని అనౌన్స్ చేశారు రాజమౌళి గారు అందరి నోట్లో ఆ పేరే నానడం వాళ్ల అదే వాళ్ల సినిమాకి టైటిల్ అయింది…అలా ఇప్పుడు కూడా మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమాకు ‘గుంటూరు కారం’ ( Guntur Karam ) అనే పేరు ఎందుకు పెట్టారు? ఏమో టీమ్‌ ఏమనుకున్నారో, ఎవరికి నచ్చిందో పెట్టేశారు అని అంటారా? మీరు చెప్పింది నిజమే కావొచ్చు.అయితే త్రివిక్రమ్‌ ( Trivikram ) తనకు ఎంతో ఇష్టమైన ‘అ’ సెంటిమెంట్‌ను పక్కన పెట్టి మరీ ‘గుంటూరు కారం’ అని పేరు పెట్టారు.

 Why Mahesh Babu Movie Named As Guntur Karam Details, Mahesh Babu, Mahesh Babu Mo-TeluguStop.com

సినిమా చూస్తే అలా ఎందుకు పెట్టారో తెలుస్తుంది అని టీమ్‌ చెబుతోంది.అయితే దీని వెనుక మరో వెరైటీ కారణాన్ని వెతికి పట్టుకున్నారు నెటిజన్లు.అదే మహేష్‌ పేరు…

Telugu Trivikram, Gssmb, Guntur Karam, Mahesh Babu, Maheshbabu, Tollywood-Movie

మహేష్‌బాబు ( Mahesh Babu ) తన పేరును షార్ట్‌గా GSSMB అంటుంటారు.ఇప్పుడు ఆ పేరును పూర్తి చేసే క్రమంలోనే త్రివిక్రమ్‌ సినిమాకు ‘గుంటూరు కారం’ అనే పేరు పెట్టారు అంటున్నారు.ఇదేం లెక్క అనుకుంటున్నారా? మహేష్‌బాబు గత సినిమా ‘సర్కారు వారి పాట’ వచ్చినప్పుడు ఓ చర్చ పెద్ద ఎత్తున జరిగింది.SSMB అని మహేష్‌ను అంటుంటారు కాబట్టి.

 Why Mahesh Babu Movie Named As Guntur Karam Details, Mahesh Babu, Mahesh Babu Mo-TeluguStop.com

అందులో తొలి అక్షరంతో సినిమా పేరు పెట్టారు అని అన్నారు.ఇప్పుడు ‘గుంటూరు కారం’తో ఇంటి పేరును కూడా యాడ్‌ చేశారు అని అంటున్నారు…

Telugu Trivikram, Gssmb, Guntur Karam, Mahesh Babu, Maheshbabu, Tollywood-Movie

మహేష్‌ రీసెంట్‌ ఐదు సినిమాలు చూస్తే. G – ‘గుంటూరు కారం’, S – ‘సర్కారు వారి పాట’, S – ‘సరిలేరు నీకెవ్వరు’, M – ‘మహర్షి’, B – ‘భరత్ అనే నేను’.ఇలా మహేష్‌ రీసెంట్‌ 5 సినిమాల మొదటి అక్షరాలు కలిపితే GSSMB వస్తోంది అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

దీంతో ఈ విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.మరి మహేష్‌ కావాలనే ఇలా చేస్తున్నాడా? లేక అనుకోకుండా జరిగిందా అనేది తెలియాలి…మామూలుగా అయితే మహేష్‌ ఇలాంటి విషయాలను ఎక్కువగా పట్టించుకుంటాడు అంటారు.మరిప్పుడు GSSMB విషయంలోనూ అదే చేశాడా? అనేది తెలియాలి.త్వరలో సినిమా ప్రెస్‌ మీట్‌ పెట్టినప్పుడు ఈ విషయాన్ని మీడియా అడిగేస్తుంది.

లేదంటే మహేషే పెద్ద మనసు చేసుకుని ట్వీట్‌ చేసి క్లారిటీ ఇవ్వాలి…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube