మహేష్ బాబు ఎందుకు అలాంటి క్యారెక్టర్లు చెయ్యడం లేదు...

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో వాళ్లకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోవడానికి చాలా రకాల సినిమాలని చేస్తూ ఉంటారు.నిజానికి ఒక హీరో తన ఎంటైర్ కెరియర్ లో డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ జీవితం చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్లు చేసిన క్యారెక్టర్లు మొత్తం కళ్ళ ముందు కదిలేలా ఉండాలి అని చాలామంది నటులు సినిమాల్లో వాళ్ళు చేసే క్యారెక్టర్ల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు.

 Why Mahesh Babu Is Not Doing Such Characters , Mahesh Babu ,maharshi Movie ,-TeluguStop.com
Telugu Bharat, Maharshi, Mahesh Babu, Pooja Hegde, Pushpa, Tollywood-Movie

అయితే మన తెలుగులో స్టార్ హీరోలు కొందరు ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవించే మనిషిలాగా మాత్రం అసలు క్యారెక్టర్లు చేయడం లేదు.అందులో మహేష్ బాబు ( Mahesh babu )ముందు స్థానంలో ఉంటాడు.ఆయన ని కనుక చూసుకున్నట్లయితే మహర్షి( Maharshi ) భారత్ అనే నేను లాంటి సినిమాల్లో ఆయన చాలా రిచ్ పర్సన్ లాగా కనిపిస్తాడు.కార్లలో తిరుగుతూ, ఫ్లైట్ లలో వెళ్తూ అలాంటి రోల్స్ మాత్రమే చేస్తున్నాడు అంతేగాని ఒక అనగారిన వర్గానికి చెందిన ఒక కుర్రాడిలా మాత్రం ఆయన ఒక్క కైరెక్టర్ కూడా చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

ఇక అందుకే ఆయనకి మొత్తం రిచ్ పర్సన్ గా ఉండే క్యారెక్టర్ లని మాత్రమే డైరెక్టర్లు రాస్తున్నారు.

 Why Mahesh Babu Is Not Doing Such Characters , Mahesh Babu ,Maharshi Movie ,-TeluguStop.com
Telugu Bharat, Maharshi, Mahesh Babu, Pooja Hegde, Pushpa, Tollywood-Movie

దానివల్ల ఆయన అవే క్యారెక్టర్ లోని చేస్తూ వస్తున్నారు.ఇక నిజానికి పుష్ప సినిమాని ( Pushpa movie )మహేష్ బాబు చేయాలి కానీ, ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ అనగారిన వర్గాలకు సంబంధించింది కావడం ఆ మట్టి మనిషి లాగా చేయడం తన వల్ల కాదు అనుకున్న మహేష్ బాబు ( Mahesh babu ) ఆ సినిమాని వదులుకోవడం జరిగింది.ఇక సినిమాలో మంచి నటనతో మెప్పించిన అల్లు అర్జున్( Allu Arjun )కి సినిమా సక్సెస్ అవ్వడంతో పాటు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

ఒక నటుడు అన్నప్పుడు అన్ని రకాల క్యారెక్టర్లని చేస్తూ ఉండాలి, వీలైతే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అడుక్కునే క్యారెక్టర్ కూడా చేయాల్సి వస్తుంది.వాటన్నిటికీ సిద్ధంగా ఉన్నప్పుడే ఒక నటుడు పరిపూర్ణ నటుడు అవుతాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube