చిరంజీవి సినిమా నుండి సూపర్ స్టార్ కృష్ణ అందుకే తప్పుకున్నాడా ?

మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరూ కూడా మంచి స్నేహితులు.

వీరిద్దరూ కాంబోలో ఆ కాలంలోనే మల్టీ స్టారర్ సినిమా వచ్చిందన్న విషయం చాలా మందికి తెలుసి ఉండక పోవచ్చు.

అయితే వీరిద్దరూ చాలా సక్యతగా ఉండేవారు.ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో చిరంజీవిని ప్రోత్సహించిన ప్రముఖుల్లో హీరో కృష్ణ కూడా ఉన్నారు.

చిరంజీవి స్వయం కృషికి పెట్టింది పేరుగా ఆయన ఇండస్ట్రీలో తారా జువ్వలా దూసుకు వచ్చారు.ప్రతిభకు, పట్టుదలకు, నిబద్ధతకు మరు పేరైన చిరుకి అదృష్టం, అవకాశం కలిసి రావడంతో వరుస చిత్రాలతో ఇండస్ట్రీకి మెగా స్టార్ గా పేరు గాంచారు.

అయితే ఇలాంటి చిరంజీవికి ఒకప్పుడు సీనియర్ హీరో కృష్ణ చాలా ప్రోత్సాహం అందించారట.అంతేకాదు వీరిద్దరూ కలిసి కొత్త అల్లుడు, కొత్త పేట రౌడి వంటి చిత్రాలలో కలిసి నటించారు.

Advertisement
Why Krishna Dropped From Chiranjeevi Movie , Chiranjeevi , Krishna , Multi Star

అయితే ఈ సినిమాలలో చిరంజీవి చాలా చిన్న పాత్రలు చేశారు.కాగా 1980 లో కృష్ణ మరియు చిరులు ప్రధాన పాత్రలలో తోడు దొంగలు అనే సినిమాని చేశారు.

ఈ సినిమా లో ఇద్దరు పాత్రలు కూడా కీలకమైనవే.ఒకరకంగా ఇది అప్పటి మల్టీ స్టారర్ మూవీ అనే చెప్పాలి.

ఈ సినిమా అప్పట్లో గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది.బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల కూడా జోరుగానే రాబట్టింది.

వీరి కాంబోకి అభిమానులు ఫిదా అయ్యారు, ఇద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ అంటూ నీరాజనాలు పలికారు.మళ్ళీ మళ్ళీ వీరి కాంబోలో ఇలాంటి చిత్రాలు రావాలని ఆకాంక్షించారు.

Why Krishna Dropped From Chiranjeevi Movie , Chiranjeevi , Krishna , Multi Star
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

అయితే ఈ సినిమా తరవాత చిరు నటించిన ఖైదీ మూవీతో ఆయన సినీ లైఫే మారిపోయింది.ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడం తో వరుస అవకాశాలు చిరుని వరించాయి.మెగాస్టార్ గా మన్నలను అందుకున్నారు చిరంజీవి.

Advertisement

అయితే చాలా ఏళ్ల తరవాత మళ్ళీ సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి నటించే అవకాశం రాగా .చర్చలు అన్ని జరిగినప్పటికీ ఆచరణలోకి మాత్రం రాలేదు.చిరు సూపర్ హిట్ మూవీ స్నేహం కోసంలో నిజానికి చిరుతో పాటు కృష్ణ కూడా నటించాల్సి ఉంది కానీ అప్పడు అది కుదరలేదు.

స్నేహం కోసం చిత్రంలో చిరు డ్యుయల్ రోల్ చేసిన విషయం తెలిసిందే.అందులో నటుడు విజయ్ కుమార్ పాత్రను మొదట కృష్ణ గారితో చేయించాలి అనుకున్నారు.

ఆ దిశగా చర్చలు కూడా జరిగాయి.కృష్ణ గారు కూడా మొదట సరే అన్నారట.అయితే అందులో చిరంజీవి సెకండ్ రోల్ పాత్ర లో కృష్ణను పెద్దయ్యా అని పిలవాల్సి ఉంటుంది.

అయితే ఇద్దరు దొంగలే చిత్రంలో పాత్రలకి ఇక్కడ భిన్నంగా ఉంటుందని ప్రేక్షకులు ఇలా యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరో అన్న అనుమానంతో ఆ ప్రాజెక్ట్ ను కృష్ణ గారు కాదన్నారు అని సమాచారం.మొత్తానికి అలా సూపర్ స్టార్, మెగాస్టార్ కలయికలో రావాల్సిన రెండో చిత్రం అలా మిస్ అయిపోయింది.

తాజా వార్తలు