ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి( Balayya Babu ) ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ఈయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కూడా సొంతం చేసుకున్నాడు.
ఇక మొత్తానికైతే బాలయ్య బాబు ప్రస్తుతం వరుస సినిమాలు చేయడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది.అందుకే ప్రస్తుతం బాలయ్య బాబు బాబీ డైరెక్షన్ లో( Director Bobby ) సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో తనని తాను మరోసారి భారీ లెవల్లో ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ఆయన ఈ సినిమా కోసం తీవ్రమైన కసరత్తులను కూడా చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబుకి ఒకప్పుడు మంచి విజయాలను అందించిన స్టార్ డైరెక్టర్లందరిని బాలయ్య బాబు పట్టించుకోవడంలేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక అందులో భాగంగానే డైరెక్టర్ బి గోపాల్( Director B Gopal ) కూడా బాలయ్య బాబుతో చాలా రోజుల నుంచి సినిమా చేయాలని ఆసక్తితో తిరుగుతున్నాడు.
అయినప్పటికీ బాలయ్య ఆయనకి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే లేనట్టుగా కనిపిస్తోంది.ఎందుకు అంటే బాలయ్య బాబు కెరియర్ లో భారీ డిజాస్టర్ అయిన పల్నాటి బ్రహ్మనాయుడు( Palnati Brahmanaidu ) సినిమా వల్ల బాలయ్య బాబు కెరీర్ చాలా వరకు డ్యామేజ్ అయింది.

అంతకు ముందు బి గోపాల్ బాలయ్యకి మంచి విజయాలు అందించినప్పటికీ ఈ ఒక్క సినిమాతో మాత్రం ఆయనకి వచ్చిన ఇమేజ్ అంత డామేజ్ అయిందనే చెప్పాలి.అందువల్లే బాలయ్య అతనికిగా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు లేనట్టుగా కనిపిస్తుంది.ఇక ఇదిలా ఉంటే లక్ష్మీనరసింహ సినిమాతో బాలయ్య బాబుకు మంచి విజయాన్ని అందించిన జయంత్ సి పరాంజీ( Jayant C Paranjee ) కూడా బాలయ్య తో సినిమా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు.కానీ బాలయ్య మాత్రం ఆయనకి అవకాశాలు ఇవ్వడం లేదు కారణం ఏంటి అంటే జయంతి సి పరంజి కూడా లక్ష్మీ నరసింహ సినిమాతో సక్సెస్ అందించినప్పటికి ఆ తర్వాత అల్లరి పిడుగు సినిమా ప్లాప్ అవ్వడం తో ఆయనతో మరో సినిమా చేయడం లేదు…
.