జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీటింగ్ అంటే చాలు.ఏపీలో అధికార పార్టీల్లో వణుకు మొదలు అవతుంది.
ఆయన మీడియా ముందుకు వచ్చాడంటే.చాలు మంత్రుల దగ్గరి నుంచి.
వైసీపీ నేతలంగా ఆయనపై మాటల మల్ల యుద్దానికి క్యూ కడతారు.విమర్శలకు అద్దు అదుపూ లేకుండా.
పూనకాలు వచ్చినట్టు ఊగిపోతారు.ఇంతకూ పవన్ అంటే వైసీపీ నేతలకు ఎందుకు అంత భయం.అంటే అందుకు ఓ బలమైన కారణం ఉంది.అయితే ఈ భయం ఒక్క వైసీపీ నేతలకే ఉందనుకుంటే.
పొరపాటే.ఇంకో వైపు టీడీపీ నేతల అంతర్మథనంలోనూ ఇదే గుబులు ఉంది.
పవన్ అంటే జనసైనికుడు అనేది ఒకప్పటి మాట.ఇప్పుడు ఆయన కాపులు ఓట్లకు ఒక బ్యాంకులా మారిపోయాడు.గోదారి జిల్లాల్లో గెలుపోటములను మార్చగల స్థాయిలో కాపుల ఓటు బ్యాంకు ఉంది.దానికి తోడు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తూర్పు కాపులు, మున్నూరు కాపులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు.
అందుకే.పవన్ అటు ఉత్తరాంధ్రాలోని వాళ్ల ఓట్లపై గురి పెట్టారు.
అంతే కాదు.గోదారి జల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లోని కాపుల ఓట్ల కోసం కూడా ప్రయత్నిస్తున్నారు.
అంతే కాకుండా వీరి వెంటే.బలిజ, ఒంటరి లాంటి కులాల వారు నడుస్తున్నారు.
ఈ కులాల ఓట్లన్నీ కలిపితే సుమారు 24 శాతం వరకూ అవుతుంది.ఇంత బలమైన ఓటు బ్యాంకును పవన్ తనవెంట తీసుకుని పోతాడనే భయంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు గుబులు పడుతున్నారు.అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను వెంట బెట్టుకుని తిరుగుతున్నారు.వైసీపీ నేతలు మాత్రం పవన్ కు అంత సీన్ లేదనేలా.ప్రచారం చేస్తున్నారు.ఈ కులాలు అన్నిటిని వైసీపీతోనే ఉంచేలా చేయాలంటే.
పవన్ కళ్యాణ్ ను ఒక డమ్మీ నేతగా చూపించాలి.అందుకే ఏపీలో వైసీపీ నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ అవేవి పెద్దగా ఫలిస్తున్నట్టు కనిపించడం లేదు.