జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370, ఆర్టికల్35ఏ లు రద్దు చేసిన దగ్గరి నుంచి పరిస్థితులు కుదుటబడ్డాయి.దాంతో అక్కడ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది.
నిజానికి ఏ రాష్ట్రంలోనైనా.రాజ్యాంగ అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత ఎన్నికలు పెట్టాలంటే.
ఎన్నికల కమీషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి.ఒక వేళ అక్కడ ఎన్నికలు నిర్వహించడానికి కుదరని పరిస్థితులు ఉంటే.
పరిస్థితులు చక్కబడే వరకూ కేంద్రం అక్కడ గవర్నర్ పాలన విధిస్తుంది.జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిలు చేదాటిపోవడంతో.
కేంద్రం అక్కడ ప్రభుత్వం రద్దు అయ్యక గవర్నర్ పాలన విధించింది.

గవర్నర్ పాలన ఆరు నెలలు గడిచాక అసలు కశ్మీర్ కు కల్పించిన ప్రత్యేక చట్టాలను రద్దు చేసి.పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకుంది.రెండు యూనియన్ టెరిటరీస్ గా విభజించింది.
జమ్మూ కశ్మీర్ కేంద్రంగా.ఢిల్లీ తరహా అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాన్ని, లద్దాక్ కేంద్రంగా పూర్తి కేంద్రం అధీనంలో ఉండే కేంద్ర పాలిత ప్రాంతాన్ని విభజించింది.
అయితే కశ్మీర్ కు అప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలెక పోవడంతో.కేంద్రం తన చేతుల్లో ఉంచుకుంది.
అక్కడి స్థానిక ప్రభుత్వాలు గుప్కర్ కమిటీగా ఏర్పడి.కేంద్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ ఏర్పాటు చేయాలని కోరాయి.

దాంతో ఎన్నికల సంగం ఇప్పుడు అక్కడి ఓటరు లిస్టును పరిశీలిస్తోంది.ఆ మధ్యన కశ్మీర్ లో ఏడాది ఉన్న వారికి కూడా ఓటు హక్కు కల్పించడం దుమారం లేపింది.దాంతో ఎన్నికల కమిషన్ కొంత వెనకడుగు వేసి సెటిలర్లకు మాత్రమే కల్పించింది.ఎన్నికల కమీషన్ చేపట్టిన ఓటరు జాబితా లిస్టు ఫైనల్ కావడంతో.నవంబర్ 25న తుది జాబితా కూడా విడుదల చేసింది.అసెంబ్లి స్థానాలను సైతం ఏకంగా 83 నుంచి 90 కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇక గుప్కర్ కమిటీ అభ్యర్థనతో పాటు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిళ్ల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.దాంతో త్వరలో జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు ప్రాచారాలకు ప్లాన్ చేస్తున్నారు.
అటు మెహబూబా ముఫ్తి.ఫారుఖ్, ఓమర్ అబ్దుల్లాలు, బీజేపీ.
ఇతర ప్రాంతీయ పార్టీలు.ఏఏ పార్టీతో జట్టు కడితే మంచిదనే విషయంపై తర్జన బర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది.







