జంగ్ సైరన్ మోగించడానికి మాజీ సీఎం కేసీఆర్ వస్తున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ( KTR ) అన్నారు.కేసీఆర్ కు కరీంనగర్ సెంటిమెంట్ అని తెలిపారు.
అధికారంలో ఉండి కూడా రేవంత్ రెడ్డికి( Revanth Reddy ) ఫ్రస్టేషన్ ఎందుకోనని ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు.తమ వైపు నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం ఉండదని వెల్లడించారు.420 హామీలు నెరవేర్చకపోతే మాత్రం వదిలి పెట్టేది లేదన్నారు.

బీఆర్ఎస్( BRS ) బీజేపీకి బీ టీమ్ అయితే కవితపై కేసు ఎందుకు అయ్యేదని ప్రశ్నించారు.కాంగ్రెస్ ( Congress ) దుష్ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament Elections ) కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీజేపీ గెలుపుకు కారణం అవుతుందనేది అంతా గమనించాలని తెలిపారు.ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి మరో ఏక్ నాథ్ షిండే అవ్వడం గ్యారెంటీ అని విమర్శించారు.







