నేను అందుకే విలన్ గా చేయాల్సి వచ్చింది: గోపి చంద్

గోపి చంద్.టాలీవుడ్ హీరో గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.

 Why Gopichand Turned Vilain Details, Gopichand, Hero Gopichand , Gopichand Villa-TeluguStop.com

తోలివలపు సినిమాతో తొలిసారిగా హీరో అయ్యారు గోపి చంద్.మధ్యలో కొన్ని సినిమాల్లో విలన్ గా నటించిన ఆ తర్వాత మళ్లీ హీరోగా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యి సక్సెస్ ఫుల్ హీరో గా కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నాడు.

టి కృష్ణ కొడుకుగా తొలత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత తనదైన ముద్రతో దూసుకెళ్తున్నారు.గత కొన్ని ఏళ్లుగా వరస ఫ్లాపులతో సతమతమవుతున్న గోపి చంద్ కి అవకాశాలకు తక్కువేమీ లేదు.

తన తోటి హీరోలు ఫుల్ ఫ్యాన్స్ అంటూ అభిమాన సంఘాలు అంటూ గోల చేస్తున్న సైలెంట్ హీరో గా గోపి చంద్ తన మార్కు చూపిస్తూనే ఉన్నాడు.2022 లో ఆరడుగుల బుల్లెట్, పక్క కమర్షియల్ వంటి రెండు సినిమాల్లో నటించిన అవి పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.ఇక 2023 లో శ్రీవాస్ దర్శకత్వంలో ఒక చిత్రం లో నటిస్తున్నాడు.2001 లో తొలివలపు సినిమా ద్వారా పరిచయం అయ్యి దాదాపు గా 21 యేళ్లగా సిని పరిశ్రమలోనే ఉన్నారు.ఈ రెండు దశాబ్దాల్లో ఆయన తీసిన సినిమాలు కేవలం 20 మాత్రమే.ఇన్నేళ్ల కెరీర్లో ఇంత తక్కువగా సినిమాలు తీయడానికి అనేక కారణాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఆయన హీరో నుంచి విలన్ గా ఆ తర్వాత మళ్లీ హీరో గా మారిన ఆయనలోని హీరో కన్నా విలన్ ని జనాలు ఎక్కువగా ఇష్టపడ్డారు.ఈ కారణం తో పాటు ఆయన సోషల్ గా ఎక్కువగా మూవ్ కారు అనే అపోహ కూడా ఉండటం.ఇక అసలు గోపి చంద్ విలన్ ఎందుకు అయ్యారో ఒక మీడియా ఇంటర్వ్యు లో ఆయన తెలిపారు.తొలి వలపు సినిమా ఫ్లాప్ అవ్వడంతో తో గోపి చంద్ కి ఒక ఐదు నుంచి ఆరు నెలల వరకు ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదట.

దాంతో తేజ మరియు కృష్ణ వంశీ ని వెళ్లి అడిగారట.వారు ఇచ్చిన సలహా మేరకు గోపి చంద్ విలన్ గా మారారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube