వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్( BRS ) అభ్యర్థుల జాబితాను ప్రకటించి చాలా రోజులైనా, ఇంకా అసంతృప్తి స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి.తాజాగా సీనియర్ నేత, బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న మోత్కుపల్లి నరసింహులు( motkupalli narasimhulu ) తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
అసలు తనకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టడానికి కారణాలు ఏమిటి అనేది తెలుసుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు.అయితే కేసీఆర్( CM kcr ) అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో డెడ్ లైన్ పెడుతూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
అసలు తనను పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు ? ఎందుకు పక్కన పెట్టారు ? ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటూ మోత్కుపల్లి ప్రశ్నించారు.
తుంగతుర్తి లేదా ఆలేరు టికెట్ వస్తుందని ఆశించాను.కానీ టికెట్ ఇవ్వలేదు.తీవ్ర అవినీతి ఆరోపణలో ఉన్న 25 మంది ఓడిపోతారని తెలిసి కూడా వాళ్లకి టికెట్లు ఇచ్చారు, మరి ఏ మచ్చలేని మాదిగ సామాజిక వర్గానికి చెందిన నన్ను ఎందుకు నిర్లక్ష్యం చేశారు ? మీరు దూరం పెట్టడంతోనే నేను తీవ్ర మానసిక క్షోభ కు గురవుతున్నానంటూ మోత్కుపల్లి వీడియో సందేశాన్ని విడుదల చేశారు.అయితే ఈ వీడియో సందేశంకు బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడంతో, దీనిపై తాడోపేడో తేల్చుకోవాలి అని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి అధినేత కేసిఆర్ >( CM kcr )పైనే అనేక ప్రశ్నలు సంధించాలి అని నిర్ణయించుకున్నారట.దీంతో ఈయన వ్యవహారాన్ని ఏ విధంగా పరిష్కరించాలనే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది. ఇది ఇలా ఉంటే మోత్కుపల్లి ( motkupalli narasimhulu )రాజకీయ ప్రస్థానం ను పరిశీలిస్తే … టిడిపి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మోత్కుపల్లి ఆ తర్వాత కాంగ్రెస్ అక్కడి నుంచి టిడిపికి అటూ నుంచి బిజెపికి వెళ్లారు .మళ్ళీ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.ఆ చేరిక సందర్భంగా కెసిఆర్ మోత్కుపల్లి సేవలను వినియోగించుకుంటామని చెప్పడంతో.
ఎమ్మెల్యేగా ఎక్కడా సర్దుబాటు చేయకపోతే ఎమ్మెల్సీ పదవైన దక్కుతుందని ఆశించారు.కానీ కెసిఆర్>( CM kcr ) ఆ అవకాశం ఇవ్వకపోవడం, ఇప్పుడు టిక్కెట్ నిరాకరించడంతో మోత్కుపల్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
దీంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.