దాసరి నారాయణరావు( Dasari Narayana Rao ) టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడని చెప్పుకోవచ్చు.150కి పైగా సినిమాలు రూపొందించి ఎన్నో సక్సెస్‌లను అందుకున్న ఈ దర్శకరత్న మెగాస్టార్ చిరంజీవి నుంచి నాగార్జున వరకు టాప్ హీరోలందరితో సినిమాలు చేశాడు.ముఖ్యంగా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకి ఎన్నో క్లాసికల్ హిట్స్‌ను ఈ దర్శకుడు అందించాడు.అయితే చిరంజీవితో ‘లంకేశ్వరుడు’ సినిమా తప్ప రెండో సినిమా చేయకపోవడం గమనార్హం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా మంది స్టార్ యాక్టర్స్, టెక్నీషియన్స్ దాసరి కారణంగానే పరిచయమయ్యారంటే అతిశయోక్తి కాదు.అయితే ఇండస్ట్రీలో ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నా దాసరినారాయణరావుకు కొందరితో విభేదాలు వచ్చాయి.
ముఖ్యంగా ఏఎన్నార్‌తో విభేదాలు తలెత్తాయి.దీనివల్ల చాలా ఏళ్లు వారిద్దరూ మాటలు కూడా మాట్లాడుకోలేదు.
కలత పెట్టే విషయమేంటంటే ఇద్దరూ తుది శ్వాస విడిచే వరకు ఒకరికొకరు హాయ్ అని కూడా చెప్పుకోలేదు.

ఒక్క పలకరింపు కూడా చెప్పుకోలేనంత శత్రుత్వం లేదా విభేదాలు వీరి మధ్య ఎందుకు వచ్చాయో మొదట్లో ఎవరికీ అర్థం కాలేదు.చివరికి ఈ విషయం గురించి స్వయంగా దాసరి నారాయణరావే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.తమ మధ్య వివాదం రావడానికి గల కారణం ఏంటో ఆయన వివరించాడు.
అక్కినేని, తన మధ్య తిట్టుకునేంతలా పెద్ద గొడవలు ఏమీ జరగలేదని కానీ ఒక చిన్న మాట పట్టింపు వల్ల ఆ పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపాడు.ఓ విషయంలో తనకు సహకరించని కారణంగా అక్కినేని నాగేశ్వరరావుతో మాట్లాడకూడదని తాను నిర్ణయించుకున్నట్లు దాసరి వెల్లడించాడు.

తాను ఏఎన్నార్ కోసం ఎంతో చేశానని కానీ ఆ ఫీలింగ్ దెబ్బతిసేలా అక్కినేని ప్రవర్తించారని, అందుకే తనతో ఇకపై మాటలు వద్దు అనుకున్నానని చెప్పుకొచ్చాడు.ఇంతకుమించి తమ మధ్య జరిగిన వివాదాలేవీ లేవని కుండ బద్దలు కొట్టాడు.ఇదిలా ఉంటే దాసరి తన ఫేవరెట్ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావే అని చాలా సందర్భాల్లో తెలిపాడు.ఇక చిరంజీవితో కూడా విభేదాలు ఉన్నట్లు వచ్చిన పుకార్లపై కూడా ఆయన స్పందించాడు.
మెగాస్టార్‌కి తాను ప్రతి చిన్న విషయంలోనూ మద్దతుగా నిలిచానని, కానీ మేస్త్రి సినిమా కారణంగా స్వల్ప విభేదాలు వచ్చాయని తెలిపాడు.ఆ సినిమాను చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని తాను తీశానని కొందరు విమర్శలు చేశారని, కానీ అది నిజం కాదని ఆయన అన్నాడు.
ఈ మూవీ సమయంలో తన కాంగ్రెస్ లో ఉన్నానని, అప్పుడు ఎలక్షన్స్ మీటింగ్స్‌లో భాగంగా పార్టీలను విమర్శిస్తూ చిరంజీవిని కూడా విమర్శించాల్సి వచ్చిందని తెలిపాడు.రాజకీయాల్లో ఉండటం వల్ల అలా చేయాల్సి వచ్చిందే తప్ప తనకు, చిరంజీవికి మధ్య భేదాభిప్రాయాలు ఏవీ లేవని స్పష్టం చేశాడు.