అల్లు అరవింద్‌ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉందా? లేదా?

మెగాస్టార్ సినీ ప్రస్థానంలో కచ్చితంగా అల్లు అరవింద్ పాత్ర కీలకంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.1980 మరియు 90ల్లో చిరంజీవి మరియు అల్లు అరవింద్ యొక్క బాండింగ్ ఏ స్థాయిలో ఉండేదో అప్పటి ప్రేక్షకులకు మరియు ఫిలిం మేకర్స్ కి తెలిసిందే.చిరంజీవి యొక్క ప్రతి సినిమా బాధ్యతలను అల్లు అరవింద్ చూసుకునే వారు.అలాగే అల్లు అరవింద్ సొంత నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ లో ఎక్కువగా చిరంజీవి సినిమాలు నిర్మాణం జరిగేవి.

 Why Chiranjeevi Not Doing Movie With Allu Aravind Production , Chiranjeevi , A-TeluguStop.com

కానీ ఈ మధ్య కాలం లో చిరంజీవి నటించిన ఏ ఒక్క సినిమా ను కూడా అల్లు అరవింద్ నిర్మించడం లేదు.అల్లు అరవింద్ పెద్ద సినిమాల నిర్మాణం విషయంలో ఆసక్తి చూపించడం లేదు అంటే సరే చిరంజీవి తో సినిమా చేయడం లేదు అనుకోవచ్చు.

కానీ అల్లు అరవింద్ ఒక వైపు చిన్న సినిమాలను నిర్మిస్తూనే మరో వైపు పెద్ద సినిమాలను కూడా నిర్మిస్తూ ఉన్నాడు.

గతంలో చిరంజీవి తో అల్లు అరవింద్‌ ఒక సినిమా చేయాలనుకుంటున్నాను అంటూ కూడా పేర్కొన్నాడు.కానీ చిరంజీవి డేట్ లో ఇవ్వక పోవడం వల్లే అల్లు అరవింద్ సినిమా చేయడం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అల్లు అరవింద్ నిర్మాణం లో చిరంజీవి సినిమా చేయాలని అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు.

అది ఎప్పటికీ సాధ్యమవుతుంది అనేది తెలియదు.

మెగా ఫ్యామిలీ లో విభేదాలు అంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది.ఆ విభేదాలు నిజమే అన్నట్లు చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి ఇన్నాళ్ళైనా కూడా అల్లు అరవింద్ నిర్మాణం లో సినిమా చేయక పోవడం విడ్డూరంగా ఉంది అంటూ సినిమా ప్రేమికులు మరియు ఇండస్ట్రీ కి చెందిన వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉన్నట్లుగానే కనిపిస్తున్నా లో లోపల మాత్రం ఏదో రగులుతోంది అంటూ కొందరు గుసగుసలాడుతున్నారు.

అసలు విషయం ఏంటి అనేది ఆ మెగా వారికీ తెలియాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube