టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ వయసులో కూడా మెగాస్టార్ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఇటీవలే భోళా శంకర్( Bhola Shankar ) సినిమాతో ప్రేక్షకులను పలకరించగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు భావించారు.
కానీ ఊహించని విధంగా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సినిమా పట్ల అభిమానులు నిరాశ చెందారు.
ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే తాజాగా చిరంజీవి కార్ల కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చిరంజీవి కార్లు అంటే పిచ్చి అన్న విషయం మనం అందరికి తెలిసిందే.ఆయన దగ్గర లక్షలు, కోట్లు విలువ చేసే కార్లు ఉన్నప్పటికీ కొత్త కొత్త కార్లను కొనుగోలు చేస్తూనే ఉంటారు.
చిరంజీవికి ముఖ్యంగా స్పోర్ట్స్ కార్లు అంటే చాలా ఇష్టమట.ప్రస్తుతం చిరంజీవి గ్యారేజీలో అత్యంత ఖరీదైన కార్లు చాలానే ఉన్నాయి.చిరంజీవి దగ్గర రోల్స్ రాయిస్ స్పెషల్ ఎడిషన్ కారు ఉందట.దీని విలువ సుమారు 8 కోట్లు ఉంటుందని సమాచారం.
దీంతో పాటు చిరంజీవి దగ్గర మెర్సెడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ కారు, ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వోగ్( Range Rover Vogue ) కూడా ఉందట.అయితే చిరంజీవి కార్లకు మాత్రం దాదాపుగా 1111 నంబర్ ఉంటుంది.చిరంజీవికి అసలు 1111 నెంబర్ అంటే ఎందుకు అంత ఇష్టం అంటే నెంబర్ 1 అనేది పోటీ తత్వాన్ని చూపుతుందని ఆ నెంబర్ చూసినప్పుడల్లా మనం ఇంకా కష్టపడాలి అని గుర్తు చేస్తుందట.ఈ కారణంగానే చిరంజీవి ఎప్పుడూ తన కార్లకు 1111 నంబర్ వచ్చేలా చూసుకుంటారట.
ఎప్పటి నుంచో ఆ నెంబర్ వాడుతుండడంతో ఆ నెంబర్‌ను ఆయన ఎంతో సెంటిమెంట్‌గా భావిస్తారట.అంతేకాకుండా ప్రతిసారి ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం లక్షలు ఖర్చు చేస్తారని తెలుస్తోంది.
మొన్నటికి మొన్న టయోటా వెల్‌ఫైర్ కార్ కి చిరంజీవి 1111 అనే నంబర్‌ను తీసుకున్నారు.ఈ ఫ్యాన్సీ నెంబర్‌ను ఆయన దాదాపు రూ.5 లక్షలు పెట్టి కొన్నారట.