నందమూరి తారక రామారావు తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు.అహర్నిశలు కష్టపడుతూ పాతాళ భైరవి, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ, మాయాబజార్ వంటి అద్భుతమైన సినిమాలను మనకు ప్రసాదించాడు.
ఈ దిగ్గజ నటుడి నట వారసత్వాన్ని నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) పుణికిపుచ్చుకున్నాడు.బాలకృష్ణ కారణంగానే ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసత్వం కొనసాగలుగుతోంది.

బాలయ్య తన 50 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ సాధించాడు.అయితే ఈ హీరో కొన్ని సమయాల్లో వరుసగా ఫ్లాప్స్ కూడా అందుకున్నాడు.ఆ తప్పులు చేయడమే కాక మంచి సినిమాలు రిజెక్ట్ చేసి పొరపాటు చేశాడు, ఇది అందరికీ కామన్‌యే అయినా ఒక్క సినిమాను మిస్ చేసుకున్నందుకు బాలయ్య బాబు ఇప్పటికీ బాధపడుతుంటాడు.ఆ సినిమా మారేదో కాదు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, రమ్యకృష్ణ, సౌందర్య నటించిన ‘నరసింహ( Narasimha )’.
ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.అయితే ప్రముఖ కథా రచయిత చిన్నికృష్ణ ఈ సినిమా కథను మొదటగా బాలకృష్ణకే వినిపించాడట.
అయితే ఆ సమయంలో బాలయ్య బాబు “సమరసింహారెడ్డి” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.అందువల్ల అతడు వేరే సినిమాను చేయాలనే ఆసక్తిని చూపలేదు.దీనివల్ల చిన్ని కృష్ణ ఆ కథను తమిళ్ డైరెక్టర్ కే ఎస్ రవికుమార్ వద్దకు తీసుకెళ్లాడు.కథ చాలా బాగుండటంతో రజనీకాంత్ ను హీరోగా సెలెక్ట్ చేసి తెరకెక్కించారు.

ఈ మూవీలో డైలాగులు, డాన్స్, కామెడీ, పాటలు అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి.ఇందులో హీరోగా బాలకృష్ణ ను సెలెక్ట్ చేసుకున్నా బాగానే నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకునేవాడు.ఆ క్యారెక్టర్ బాలయ్యకు బాగా సూట్ అయ్యేది.రమ్యకృష్ణ కు దీటుగా నటించి అదరగొట్టేవాడు.కానీ ఈ మంచి అవకాశాలన్నీ మిస్ అయిపోయాయి.దీనిని మిస్ చేసుకోవడం బాలయ్య దురదృష్టం అని చెప్పుకోవచ్చు.
దీనిని మిస్ కావడం వల్ల బాలయ్య కెరీర్ కి వచ్చిన నష్టమేమీ లేదు కానీ అందులో చేసి ఉంటే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి లభించేది.అలాగే బాలయ్య నరసింహుడిగా ఉగ్రావతారంలో కనిపించే ఛాన్స్ దక్కేది.
స్టైలిష్ గా కూడా ఈ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి బాలకృష్ణకు అద్భుతమైన అనుభూతి కలిగి ఉండేది.