అంత కోపం ఎందుకు సారు ? 

తెలంగాణ ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్ ఓటమి చెందడం , కాంగ్రెస్ ( Congress )అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.కచ్చితంగా తెలంగాణలో తాము గెలుస్తామనే  ధీమాతో ఉంటూ వచ్చిన కెసిఆర్ కు ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి.

 Why Are You So Angry , Brs,  Telangana Government,   Telangana Elections,   Brs-TeluguStop.com

హ్యాట్రిక్ విజయం తమకే సొంతం అని ఫిక్స్ అయిపోయిన కేసీఆర్ కు కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఊహించని పరిణామమే.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కేసీఆర్  సైలెంట్ గా ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు.

కనీసం ఓటమి పై పార్టీ నాయకలతో విశ్లేషణ చేయకపోవడం, బీఆర్ ఎస్ కు ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పకపోవడం,  అలాగే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి విషెస్ చెప్పడం వంటివి చేయకుండానే కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లడం పై సొంత పార్టీ నేతలు కేసీఆర్ వైఖరిని తప్పుపడుతున్నారు .ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 38 శాతం ఓట్లు లభించాయి .

Telugu Brs, Revanth Reddy, Telangana-Politics

39 స్థానాలో అభ్యర్థులు గెలిచారు.అయినా మళ్లీ పార్టీ అధికారంలోకి రాలేదని, సీఎం కుర్చీ దక్కలేదనే అసంతృప్తి కేసీఆర్ లో కనిపిస్తోంది .అందుకే ఆయన ఎన్నికల ఫలితాలపై స్పందించకుండానే ఫామ్ హౌస్ కు వెళ్లినట్లుగా మీడియా , సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.అయితే అతిపెద్ద పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ను సమర్ధవంతంగా నడిపించిన కేసీఆర్ ఇప్పుడు ఈ విధమైన వైఖరిని ప్రదర్శిస్తూ ఉండడం బీఆర్ఎస్ కు మరింత చేటు చేస్తుంది తప్ప , కలిసొచ్చేదేమి ఉండదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత,  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి స్పందించారు.కానీ బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసిఆర్( KCR ) ఈ విషయంలో స్పందించకపోవడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.

Telugu Brs, Revanth Reddy, Telangana-Politics

తొమ్మిదేళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్నామని , ఆ సమయంలో కొన్ని కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చునని,  వాటిని సమీక్షించుకుంటామని కెసిఆర్( KCR ) నోటితో చెప్పి ఉంటే బాగుండేది.కానీ పార్టీ అధికారంలోకి రాలేదనే అసంతృప్తితో కేసీఆర్ వంటి రాజకీయ ఉద్దండడు ఈ విధంగా చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube