ఆఫ్గాన్ తో టీ20 సిరీస్ ఆడే జట్టుకు ఈ ఆటగాళ్లను ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే..?

భారత గడ్డపై భారత్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ ( Afghanistan )మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సిరీస్ ఆడే భారత జట్టులో కొందరు కీలక ఆటగాళ్లకు స్థానం దక్కక పోవడానికి గల కారణాలు ఏమిటో భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్( Rahul Dravid ) తెలిపాడు.

ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో విరామం కావాలని కోరడంతో విశ్రాంతి ఇవ్వడం జరిగింది.భారత జట్టులో పోటీ కాస్త ఎక్కువగా ఉండడం కారణంగా శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేయలేదు.

శ్రేయస్ అయ్యర్ ఉత్తమ బ్యాటర్ అయినప్పటికీ 11 మంది ఉండే జట్టులో అందరినీ ఆడించడం అంటే కష్టమే కదా.అందుకే శ్రేయస్ అయ్యర్ ను పక్కన పెట్టాల్సి వచ్చింది.

ఇక ఇంగ్లాండ్ తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను దృష్టిలో పెట్టుకుని బుమ్రా, జడేజా, సిరాజ్( Bumrah, Jadeja, Siraj ) లను టీ20 సీరీస్ కు ఎంపిక చేయలేదు.ఇకపోతే భారత జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత కారణాలవల్ల ఆఫ్ఘనిస్తాన్ తో ఆడే తొలి టీ20 మ్యాచ్ ఆడడం లేదు.రెండు, మూడు టీ20ల్లో విరాట్ కోహ్లీ( Virat Kohli ) బరిలోకి దిగుతాడు.

Advertisement

భారత జట్టు ప్రయోజనాలను అనుసరించే కూర్పుపై నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని రాహుల్ ద్రావిడ్ తెలిపాడు.రోహిత్ శర్మ తో పాటు యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు.ఓపెనింగ్ లో కుడి, ఎడమ చేతివాటం కూర్పు ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశం.

రింకు సింగ్ ఫినిషర్ పాత్రలో అద్భుతంగా రాణిస్తున్నాడు.రింకుతో పాటు జైస్వాల్, తిలక్ లాంటి ఎడమచేతి వాటం ఆటగాళ్లు జట్టులో ఉండడం మంచిదే.

క్రమశిక్షణ రహిత్యం కారణం వల్ల కొందరు ఆటగాళ్లపై వేటు వేశారని వినిపిస్తున్న ఊహాగానాలను కొట్టి పారేస్తూ.రాహుల్ ద్రావిడ్ స్పష్టత ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు