Anshu Ambani : నాకు ఆ రోజు ఈ విషయాలు తెలియక ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాను : అన్షు

ప్రతి హీరోయిన్ ఇండస్ట్రీలో ఒక స్టార్ డం సంపాదించుకోవాలంటే దాని వెనుక ఎన్నో కష్టనష్టాలు ఉంటాయి.అన్ని దాటుకొని ఇండస్ట్రీలో ఉండగలిగిన వాళ్లే ముందుకెళ్తారు.

 Why Anshu Ambani Left Tollywood Industry-TeluguStop.com

లేదంటే ఎవరి దారిన వారు వెళ్ళిపోతుంటారు.అలాంటి ఒక పరిస్థితి మన్మధుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్డం అందుకున్న హీరోయిన్ అన్షు అంబాని( Anshu Ambani )కి కూడా వచ్చిందట.

అందుకే ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచే కాదు మొత్తం సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.ఇంతకీ ఆమె సౌత్ ఇండియా పరిశ్రమ నుంచి తప్పుకోవడానికి గల కారణమేంటి ? సినిమాలు ఎందుకు మానేయాల్సి వచ్చింది అనే విషయాలను ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది.ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Anshu Ambani, England, Hyderabad, Manmadhudu, Nagarjuna, Prabhas, Raghave

అన్షు ఇంగ్లాండ్(England ) నుంచి ఇండియాకి వచ్చి సినిమాల్లో నటించడం మొదలుపెట్టిందట.ముఖ్యంగా హైదరాబాదులో ఆమె ప్రయాణం మొదలైందట.ఆమెతో పాటు ఎల్లప్పుడూ తన తండ్రి ఎంతో ఇబ్బంది ఉన్నా కూడా ఉండాల్సి వచ్చేదట.

తన తండ్రి ఒక ఓవర్ ప్రొటెక్టివ్ ఫాదర్ అని అందువల్లే తనను వదిలేయకుండా ఆయన కూడా వచ్చేసి తనతో పాటే ఉండేవాడని దానివల్ల ఫ్యామిలీకి చాలా ఇబ్బందులు వచ్చాయని తెలిపింది.ఇక అప్పట్లో మేనేజర్స్, పిఆర్ వ్యవస్థ గురించి తనకు పూర్తి అవగాహన లేదని, అందువల్ల సినిమాలు ఎలా దక్కించుకోవాలనేది తెలియలేదని కూడా చెబుతోంది ఈ అమ్మడు.

Telugu Anshu Ambani, England, Hyderabad, Manmadhudu, Nagarjuna, Prabhas, Raghave

సినిమా ఇండస్ట్రీకి వచ్చే సమయానికి తాను చాలా చాలా చిన్నమ్మానని అందువల్ల ఆ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి ఎలాంటి అవకాశాలు దక్కించుకోవాలి ఎవరితో మాట్లాడాలి అనే విషయాలను తెలుసుకోలేకపోయాను అని, తెలిసే సమయానికి తనకు ఇండస్ట్రీ నచ్చలేదని అందుకే మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోయామని తెలిపింది.ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యానని ఇప్పుడు పరిస్థితి చాలా బాగుందని మళ్లీ అవకాశమస్తే నటించాలని కూడా కోరుకుంటున్నానని అన్షు తెలిపింది.ఆ టైం లో మంచి నటులతో నటించే అవకాశం దక్కిందని, ఈ రోజు తనతో పాటు నటించిన ప్రభాస్( Prabhas ( వరల్డ్ స్టార్ గా ఉన్నందుకు సంతోషంగా ఉందని కూడా తెలిపింది అన్షు అంబానీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube