ఖుషి సినిమాలో అమీషా పటేల్ ని ఎవరి కోసం తీసేసారో తెలుసా ?

తెలుగులో సూపర్ ఫామ్ లో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఖుషి.

ఈ చిత్రానికి ఎస్ జై సూర్య దర్శకత్వం వహించగా, నిర్మాతగా ఏ ఎం రత్నం వ్యవహరించారు.

ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.అప్పటికి వరస హిట్ సినిమాల్లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ కి ఖుషి సినిమా ద్వారా ఒక అద్భుతమైన ఇండస్ట్రీ హిట్ లభించింది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు భూమిక పర్ఫామెన్స్ కూడా తోడవడంతో ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కి ఇదొక మైల్ స్టోన్ మూవీగా ఉండిపోయింది.అయితే ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే నేరుగా విడుదలైన తమిళ, హిందీ, కన్నడ భాషల్లో సైతం రీమేక్ గా విడుదలైంది.

మిగతా ఏ భాషల్లోనూ కూడా హిట్ అవ్వని ఈ చిత్రం తెలుగులో మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇక ఈ సినిమా నిర్మాత కెరియర్ లో సైతం ఒక అద్భుతమైన హిట్ సినిమాగా నిలిచింది.

Advertisement
Why Amisha Patel Removed From Khushi Movie , Amisha Patel, Khushi Movie, Pawan

ఈ సినిమా కోసం తొలుత సంగీత దర్శకుడుగా ఏఆర్ రెహమాన్ ని తీసుకున్నప్పటికీ ఆయనకు చాలా సినిమాలు లైన్ లో ఉండడంతో ఆయన స్థానంలో మెలోడీ బ్రహ్మ అయినటువంటి మణి శర్మ చేతులు మీదుగా సంగీత సమకూర్చారు.ఈ సినిమా కోసం ఆయన అద్భుతమైన మెలోడీలు ఇవ్వడంతో సంగీత పరంగా కూడా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది ఖుషి.

ఒకవేళ ఏ ఆర్ రెహమాన్ సంగీతం ఇచ్చినా కూడా ఇంతటి అద్భుతమైన సంగీతం ఇచ్చేవారు కాదేమో అని అనిపించేలా మణిశర్మ ఆల్బమ్ అందరినీ ఆకర్షించింది.ఈ సినిమా విడుదలైన తర్వాత ఏకంగా 105 సెంటర్లో 50 రోజులు 79 సెంటర్స్ లో వంద రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది.

Why Amisha Patel Removed From Khushi Movie , Amisha Patel, Khushi Movie, Pawan

ఇక ఈ సినిమా కోసం మొదట అమీషా పటేల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు.అప్పటికే కహోనా నా ప్యార్ సినిమాతో అమిషా పటేల్ కెరీర్ ఫుల్ పీక్ లో ఉంది.అంతేకాదు అంతకుముందుతో పవన్ కళ్యాణ్, అమీషా కలిసి బద్రి అనే సినిమాలో సైతం నటించారు.

సినిమా షూటింగ్ స్టార్ట్ అయి కొంతమేర షూటింగ్ జరిగిన తర్వాత అమీషా పటేల్ తో పవన్ కళ్యాణ్ ఎక్కువగా క్లోజ్ అయ్యారట.బయట షికార్లు చేస్తూ షూటింగ్ కి కూడా డుమ్మా కొట్టే పరిస్థితి వచ్చిందట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

దాంతో అనిషా ని తప్పించి భూమిక ను హీరోయిన్ గా తీసుకున్నారు మేకర్లు.

Advertisement

ఒక్కోసారి వీరిద్దరూ బయట షికార్లు కొడుతుండడంతో షూటింగ్ కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చేదట.అందుకే అమీషా పటేల్ ని తప్పించి భూమిక హీరోయిన్ గా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.ఇది ఎంతవరకు నిజం అనే విషయంలో క్లారిటీ లేదు కానీ అప్పట్లో మాత్రం అనేక రూమర్స్ వీరి గురించి రావడంతో ఈ విషయం సంచలనంగా మారింది.

ఇక భూమిక ప్రదర్శన సైతం సినిమా విడుదలయ్యాక మరో రేంజ్ గా చేరింది.ఆమె నడుము సన్నివేశాన్ని కొన్ని వందల సార్లు చూసుంటారు ఇప్పటికే అనేకమంది భూమిక అభిమానులు.

ఒకవేళ అమీషా పటేల్ నటించిన కూడా ఈ సినిమా అంతటి హిట్ అయ్యేది కాదేమో.

తాజా వార్తలు