Sr Ntr Akkineni Nageswara Rao: 4 సార్లు అడిగిన అక్కినేని ఆ విషయంలో ఎన్టీఆర్ కి ఎందుకు నో చెప్పాడు ?

అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్ కి తొలినాళ్లలో సినిమాల విషయంలో కొంత వైరం ఉండేది.కానీ అది సినిమాల వరకు మాత్రమే.

 Why Akkineni Rejected Politics With Ntr Details, Akkineni, Ntr, Akkineni Nageswa-TeluguStop.com

ఇద్దరు నిజ జీవితంలో ఎంతో మంచి స్నేహితులుగా ఉండే వారు.ఒకరి సినిమాల గురించి ఒకరు మాట్లాడుకునేవారు.

వారి వారి కుటుంబం గురించి ఒకరినొకరు సలహాలు, సమాదానాలు అడిగేవారు.అలాంటి టైం లో దాదాపు ఎన్టీఆర్ కి అరవై ఏళ్ళు, అక్కినేని కి 59 ఏళ్ళు వచ్చే టైం కి ఒక రోజు సాయంత్రం పూట కలిసి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఎన్టీఆర్ అక్కినేని తో రాజాకీయాల గురించి మాట్లాడుతూ తాను పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేయబోతున్నట్టు చెప్పారట.

అయితే తానొక్కడే వెళ్లాలనుకోలేదు.తనతో పాటే అక్కినేని ని కలుపుకొని వెళ్లాలని ఇద్దరు కలిసి రాజకీయ రంగ ప్రవేశం చేయాలని భావించారట.అందుకోసం అక్కినేని ని సైతం రాజకీయాల్లోకి రమ్మంటే అయన ఆలోచిస్తా అన్నారట.ఆలా ఒక్క సారి కాదు నాలుగు సార్లు జరిగిందట.

మొదటి సారి చెప్పినప్పుడు మంచి విషయమే ఆలోచిద్దాం అని చెప్పిన అక్కినేని, రెండవ సారి ఎన్టీఆర్ అడిగినప్పుడు మాత్రం ఎందుకో కాస్త వెనకడుగు వేసారట.చూద్దాంలే బ్రదర్ అంటూ తప్పించుకున్నాడట.

ఇక మూడవ సారి ఒక సినిమా షూటింగ్ లొకేషన్ లో కలిసినప్పుడు కూడా ఇదే విషయం అక్కినేని ని మరోమారు ఎన్టీఆర్ ఖచ్చితంగా అడిగారట.

Telugu Akkineni, Anr, Nandamuritaraka, Sr Ntr, Sr Ntr Anr, Tollywood-Movie

కానీ అందుకు అక్కినేని ఖచ్చితంగా ఇది నాతో అయ్యే పని కాదు అని చెప్పారట.రాజకీయం అంటే పూలు పడతాయి, రాళ్లు పడతాయి.అందుకే తనకు ఇషటం లేదు అని చెప్పాడట.

ఇక చివరి సారి లక్ష్మి పార్వతి తో పెళ్లయ్యాక ఇంటికి భోజనానికి పిలిచి మరి చివరి సారి అడుగుతున్న ఇద్దరం కలిసి రాజకీయం చేద్దాం అని అడిగితే అక్కినేని నిర్మొహమామాటం గా రిజెక్ట్ చేశారట.తాను అప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ కోసం బాగా డబ్బు ఖర్చు చేయడం తో డబ్బులు లేవని, బైపాస్ సర్జరీ కావడం తో ఆరోగ్యం కూడా లేదని , ఈ రెండు లేకుండా రాజకీయాలు కుదరవని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube