Digital Gifts : ఆలయాలలో స్కాన్ చేసి డబ్బులు వేయొచ్చు.. డిజిటల్ కానుకలకు ప్రోత్సాహం..

నరేంద్ర మోదీ సర్కార్‌లో భారతదేశం పూర్తిగా డిజిటలైజేషన్ అయిపోతుంది.డబ్బుకు సంబంధించి అన్ని కార్యకలాపాలను మొబైల్‌లోనే చిటికెలో ఫినిష్ చేసుకునేలా నేడు ఇండియాలో సదుపాయాలు ఉన్నాయి.

 You Can Scan And Deposit Money In Temples.. Encouragement For Digital Gifts , E--TeluguStop.com

అందువల్ల ఎవరూ కూడా తమ జేబుల్లో కరెన్సీ నోట్లు, నాణేలు పెట్టుకొని తిరగడం లేదు.దీనివల్ల కొన్నిసార్లు ఎవరికైనా విరాళాలు ఇవ్వాలన్నా, దానాలు చేయాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ముఖ్యంగా ఆలయాల్లోని హుండీలలో ఎంతోకొంత డబ్బులు వేసి పుణ్యం కట్టుకుందామనుకునే వారికి సమయానికి భౌతికంగా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు.దీనివల్ల ఆలయాలకు కూడా రెవిన్యూ తగ్గుతుంది.

అయితే ఈ సమస్యకు పరిష్కారంగా దేవాలయాల్లో సైతం ఎలక్ట్రిక్ హుండీల విధానాన్ని తీసుకొచ్చే పనిలో పడ్డారు నిర్వాహకులు.ఈ-హుండీలు ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

అది మరెక్కడో కాదు మన తెలుగు రాష్ట్రం తెలంగాణలోనే! ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా డిజిటల్ విధానంలో స్వామి వారికి కానుకలను వేయడానికి వీలుగా ఈ-హుండీలు ఏర్పాట్లు చేస్తున్నారు.దీనివల్ల ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింపుల్‌గా స్వామి వారికి డిజిటల్ రూపంలో డబ్బులు అందించడం సాధ్యమవుతుంది.

Telugu Gifts, Hundis, Electric Hundi, Narendra Modi, Kaanukalu, Qr Codes, Telang

రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు భక్తుల సౌకర్యార్థం ఈ క్యాష్‌లెస్ విధానాన్ని అమలు చేస్తున్నారు రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా వెలగటూర్ మండలంలోని కోటిలింగాల కోటేశ్వర స్వామి దేవాలయంలో ఈ-హుండీని ఏర్పాటు చేశారు.ఇక్కడికి వచ్చిన భక్తులు కానుకలు సమర్పించుకోవడానికి క్యూఆర్ స్కాన్ చేసి తమకు చాతనైనంత దానం చేశారు.సిద్దిపేట జిల్లా నాచారం గుట్ట నాచగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అధికారులు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు.వారు లక్ష్మీనరసింహ స్వామి వారి పేరుమీద ఒక బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి.

క్యూఆర్ కోడ్‌ను ఆలయంలో అంటించారు.దానిని స్కాన్ చేసి భక్తులు కానుకలు ఇస్తున్నారు.

తెలంగాణలోని ఇతర ప్రముఖ ఆలయాల వద్ద కూడా ఈ విధానం అమల్లోకి వస్తోంది.ఏదేమైనా ఈ ఆలోచనను భక్తులతో పాటు చాలామంది ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube