సినిమా అంటేనే ఒక విచిత్ర ప్రపంచం.ఎవరైనా హీరో ఒక విజయం సాధిస్తే మళ్లి అదే తరహా పాత్రలు వస్తూ ఉంటాయి.
మళ్లి అదే రకమైన పాత్ర చేయాలంటే చాల ఇబ్బంది.అదే మూస పాత్రకు ఇక జనాలు అలవాటు పడతారు.
పోనీ చేయకుండా వదిలేద్దామా అంటే కెరీర్ తొలినాళ్లలో ఈ హీరో కథ నచ్చలేదు అంటాడా అని సదరు నిర్మాణ సంస్థ వారికి కోపం వచ్చే అవకాశం ఉంటుంది.మళ్లి ఇంకో సినిమా కోసం పిలుస్తారో లేదో అనే భయం కూడా ఉంటుంది.
ఇలాంటి క్లిష్టమైన విషయాలలో చాల చాక చక్యంగా వ్యవహరించే వారు అక్కినేని నాగేశ్వర రావు.( Akkineni Nageswara Rao )
సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) కన్నా కూడా అక్కినేని ముందుగా ఇండస్ట్రీ కి వచ్చారు.
నిజానికి ఎన్టీఆర్ కంటే కూడా అక్కినేని వారికి విజయాలు ఎక్కువ.అయితే అక్కినేని దేవదాస్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
ఆ చిత్రం తర్వాత చాల మంది దర్శకులు అలంటి కథలను పట్టుకొని అక్కినేని సినిమాలో నటించమని అడిగారట.కానీ అందుకు అక్కినేని ఏమాత్రం ఒప్పుకోలేదట.
ఆ మూస లో కొట్టుకుపోవాలని అయన అనుకోలేదు.

మరో వైపు దేవదాసు సినిమాలో( Devadasu Movie ) కామెడీ తో కూడా అక్కినేని మెప్పించారు.ఆలా కామెడీ అడిగి మరి పెట్టించుకున్నారట.మిస్సమ్మ సినిమాలో( Missamma Movie ) అయితే సావిత్రి దగ్గర సంగీతం నేర్చుకునే సన్నివేశంలో, పేపర్ లో యాడ్ ఇవ్వడం కోసం అక్కినేని చిరునామా చెప్పే సన్నివేశంలో అయన కామెడీ మార్కు కనిపిస్తుంది.
ఆధ్యంతం ఆయన ఈ సినిమాలో తన మోముపై చిరునవ్వు లేకుండా కనిపించరు.

కేవలం మోముతోనే హాస్యం పండించి మొక కవళికలతోనే నటించగల గొప్ప నటుడు అక్కినేని. అయితే మిస్సమ్మ సినిమాలోని ఈ కమెడియన్ లాంటి డిటెక్టీవ్ పాత్రను అడిగి మరి నటించారట.మొదట్లో అందుకు నిర్మాత ఒప్పుకోకపోయినా అక్కినేని బలవంతం చేయడం తో కాదనలేక పోయారట.
విజయ వారి సినిమాల్లో మొదటి నుంచి అక్కినేని కి మంచి గ్రిప్ ఉంది.అయితే అక్కినేనితో కామెడీ చేయించడం అనేది మంచి ప్లస్ పాయింట్ అయ్యింది సినిమాకు.







