భారతదేశానికి చెందిన రెండు.. ఈ సిరప్ లను వాడొద్దని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక.. ఎందుకంటే

భారత దేశంలో తయారైన రెండు దగ్గు సిరప్లను చిన్నపిల్లలకు ఇవ్వద్దని ఉభేకిస్తాన్ ప్రభుత్వానికి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.ఈ సిరప్లలో విషపూరితమైన ఈ ఇథినాల్ గ్లైకాల్ ఉన్నట్లు వెల్లడించింది.

 Who Issues Alert Not To Use Two Indian Cough Syrups Dok 1 Max Ambranol Details,-TeluguStop.com

దేశంలోనే నోయిడాకు చెందిన మారియాన్ బయోటెక్ తయారు చేసిన రెండు దగ్గు మందులు, డక్ వన్ మాక్స్ సిరప్, అంబ్రోనాల్డ్ చిన్నపిల్లలకు వినియోగించకూడదని వెల్లడించింది.ఉబ్బే కిస్తాన్ లో 19 మంది పసిపిల్లల మరణానికి వీటితో సంబంధం ఉందని స్పష్టం చేసింది.

పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో మార్యాన్ బయోటెక్ తయారు చేసిన ఈ దగ్గు మందు తాగడం వల్ల 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.21 మంది చిన్న పిల్లలు ఈ సిరప్ ను తాగగా వారిలో 19 మందికి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చాయని తెలిపింది.ల్యాప్ లో ఈ సిరప్ ను పరిశీలించగా వాటిలో విషపూరితమైన ఇథిలిన్ గ్లైకాల్ ఉన్నట్లు తెలిసింది.దీనితో ఉబ్బేక్ ప్రభుత్వం డబ్ల్యూహెచ్ఓ కు ఫిర్యాదు చేసింది.

Telugu Ambranol Syrup, Childern, Dok Max Syrup, Indiancough, International, Biot

నాణ్యమైన మందులను అందించడంలో మార్యాన్ బయోటెక్ విఫలమైందని సిరప్ల తయారీలో నిర్నిత ప్రమాణాలను పాటించలేదని పేర్కొంది.ఈ నేపథ్యంలో సంస్థ తయారు చేసిన రెండు సిరప్ లు చిన్నపిల్లలకు ప్రాణాంతకమైనవి వాటిని ఉపయోగించకూడదని డబ్ల్యూహెచ్వో సూచించింది.ఇంకా చెప్పాలంటే పోయిన సంవత్సరం అక్టోబర్ లో భారతదేశానికి చెందిన మైడెన్ ఫార్మసిటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు దగ్గు జలుబు సిరప్లను వాడొద్దంటూ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక చేసిన విషయం తెలిసిందే.

Telugu Ambranol Syrup, Childern, Dok Max Syrup, Indiancough, International, Biot

పిల్లలకు ఈ సిరప్ లో మూత్రపిండాలను పాడు చేస్తున్నానని ఇతర సమస్యలకు కూడా దారితీస్తున్నాయని వెల్లడించింది.ఆఫ్రికన్ దేశమైనా గాంబియాలో 66 మంది పిల్లల మరణాలకు ఈ కంపెనీ తయారుచేసిన దగ్గు సిరప్లకు సంబంధం ఉందని వెల్లడించింది.ప్రొమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్‌మలిన్ బేబీ కఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ అనే నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లలో డైథలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ ఉన్నాయని ఇవి మనుషులకు విషపూరితమైనవని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube