రవితేజ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇడియట్ మరియు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ( Amma Nanna o tamilammay )సినిమాలో మీకు గుర్తుండే ఉంటాయి.ఈ రెండు సినిమాలు కూడా వారిద్దరి కెరియర్ లో అద్భుతమైన విజయాలు కాగా వీరితో పాటు సంగీత దర్శకుడు చక్రి కుడా హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు.
ఈ రెండు సినిమాలకన్నా కూడా ముందు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సినిమాతో ఈ ముగ్గురు ఒకేసారి కలిసి పని చేశారు అలా ఈ ముగ్గురు కాంబినేషన్ లో మూడు మంచి సినిమాలు ఇండస్ట్రీకి దక్కడం మాత్రమే కాదు వీరికి కెరియర్ లోనే గుర్తుండిపోయే చిత్రాలుగా మిగిలిపోయాయి.అయితే రవితేజ తో పూరి జగన్నాథ్ కెమిస్ట్రీ చాలా చక్కగా ఉంటుంది అందుకే వీరి మధ్య మంచి సినిమాలు వస్తాయి.

పూరి జగన్నాథ్( Puri Jagannath ) నిజజీవితంలోని అనేక సంఘటనల నుంచి ఇన్స్పైర్ అవుతూ సినిమాలను తీస్తూ ఉంటాడని అందరూ అంటూ ఉంటారు.అలాంటి ఒక సంఘటనని రవితేజ సినిమాలు అయినా అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్ చిత్రాల్లో కూడా జరిగింది.అదేంటంటే ఈ రెండు సినిమాల్లో కూడా హీరో తల్లి పాత్ర చాలా చక్కగా ఉంటుంది ఎంత బాగా ఉంటుందంటే తండ్రి ఏం తిట్టినా సరే తల్లి దోశలు వేసి పెడుతుంది అలాగే తండ్రి వదిలేసి వెళ్లిన ఆ తల్లి కొడుకుతో పాటే ఉంటుంది.ముఖ్యంగా అమ్మానాన్న ఓ తమిళమ్మాయి చిత్రంలో జయసుధ మరియు రవితేజ కాంబినేషన్ చాలా చక్కగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడంతో పాటు ఈ పాత్ర అద్భుతంగా పండింది.

అయితే ఈ తల్లి పాత్రలు నిజ జీవితంలో ఎక్కడ నుంచి పూరి జగన్నాథ్ ఆదర్శంగా తీసుకున్నారు తెలిస్తే ఆశ్చర్యపోక మానరు.రవితేజ నిజ జీవితంలో తన తల్లి రాజ్యలక్ష్మి( Rajya Lakshmi ) కూడా అంతే మోడరన్ గా ఉంటూ చక్కగా తల్లి చాటు బిడ్డలా రవితేజను పెంచారట.ఆమె లేకుండా రవితేజ జీవితం ఈరోజు ఇలా ఉండేది కాదు అంటూ పలుమార్లు రవితేజ కూడా చెబుతూ ఉంటాడు.ఈ చిత్రంలో జయసుధ పాత్రకు ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో రవితేజ తల్లి నిజంగా నిజ జీవితంలో కూడా అలాగే ఉంటారట.
అచ్చు ఆ పాత్ర లాగానే బిహేవ్ చేస్తూ ఉంటారట అందుకే ఆ సినిమాల్లో రవితేజ తల్లిని ఊహించుకొని ఆ పాత్ర రాసినట్టుగా పూరి జగన్నాథ్ తెలిపారు.







