టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ డైరెక్టర్ ఎవరనే చర్చ తరచూ జరుగుతూ ఉంటుంది.రాజమౌళి, సుకుమార్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు కాగా ఈ ఇద్దరు డైరెక్టర్లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.
ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లలో నంబర్ వన్ ఎవరనే పశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తాయి.అయితే ఎక్కువమంది మాత్రం రాజమౌళి పేరు సమాధానంగా చెబుతారు.
రాజమౌళి వల్లే తెలుగు సినిమాల బడ్జెట్ పెరిగింది.

తెలుగు సినిమాలు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతున్నాయి.బాహుబలి, బాహుబలి2 సినిమాల వల్లే టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఇతర భాషల్లో భారీ సంఖ్యలో థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.రాజమౌళి( Rajamouli ) వల్లే ప్రస్తుతం సుకుమార్ మాస్ సినిమాలపై దృష్టి పెట్టారు.
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఒక ఇంటర్వ్యూలో జక్కన్న ఇచ్చిన సలహా సుకుమార్ ను మార్చేసింది.

సుకుమార్( Sukumar ) క్లాస్ సినిమాలు తీస్తున్నారు కాబట్టి సరిపోయింది కానీ మాస్ సినిమాలు తీస్తే సుకుమార్ ను ఎవ్వరూ ఆపలేరనే అర్థం వచ్చేలా రాజమౌళి ఒక సందర్భంలో కామెంట్ చేయగా ఆ కామెంట్లను సీరియస్ గా తీసుకున్న సుకుమార్ రంగస్థలం, పుష్ప ది రైజ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.ఊహించని కథ కథనాలతో ప్రేక్షకుల నాడి పట్టుకుంటున్నారు.నేషనల్ అవార్డ్స్ లో పుష్ప ది రైజ్( Pushpa ) సినిమాకు కేవలం రెండు అవార్డులు వస్తే ఆర్.
ఆర్.ఆర్ సినిమాకు ఏకంగా 6 అవార్డులు వచ్చాయి.ఆ విధంగా చూసినా కూడా రాజమౌళి నంబర్ వన్ అని చెప్పవచ్చు.అయితే సుకుమార్ నుంచి జక్కన్నకు మాత్రం గట్టి పోటీ ఎదురవుతోంది.బాహుబలి2, ఆర్.ఆర్.ఆర్ రేంజ్ లో పుష్ప2 మూవీ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది.రాజమౌళి, సుకుమార్ కెరీర్ పరంగా ఎంత సక్సెస్ అయినా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు.