తేలేది ఆరోజే.. " హూ ఈజ్ లీడర్ " ?

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని( BJP ) గద్దె దించేందుకు విపక్షాలు గట్టిగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

అగ్రనేతలందరూ కూడా ఐక్యత గురించి ప్రస్తావిస్తూ రోజు వార్తల్లో నిలుస్తున్నారు.

అయితే ఐక్యత పై అన్నీ పార్టీలు కూడా సానుకూలంగా ఉన్నప్పటికి విపక్షలను నడిపించే నాయకత్వంపైనే అందరి దృష్టి నెలకొంది.విపక్షాల తరుపున ఉన్న నేతలంతా హేమాహేమీలు కావడడంతో లీడర్ ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది.

నితిశ్ కుమార్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ. ఇలా అందరూ కూడా లీడర్ గా అర్హత ఉన్న నాయకులే.

అందుకే మోడిని ( Modi ) ఢీ కొట్టే సరైన లీడర్ ను ఎంచుకోవడం విపక్షలకు పెద్ద టాస్క్ లా మారింది.

Advertisement

అంతే కాకుండా ఎన్నుకున్న లీడర్ ను అందరూ స్వాగతించేలా చూడడం కూడా కత్తిమీద సాము లాంటిదే.కాబట్టి ముందు లీడర్ ఎంపికపైనే విపక్షాలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఈ నెల 23న విపక్షాలన్నీ పాట్నాలో బేటీ కానున్నాయి.

ఈ బేటీకి రాహుల్ గాంధీ,( Rahul Gandhi ) మల్లికార్జున్ ఖర్గే, కేజ్రీవాల్, స్టాలిన్, మమతా బెనర్జీ, నితీశ్ కుమార్.వంటి ప్రముఖులు హాజరు కానున్నారు.మొదట ఈ బేటీని ఈ నెల 16 నే నిర్వహించాలని భావించినప్పటికి పలు పార్టీల వినతి మేరకు తేదీని 23 కు మర్చినట్లు బిహార్ డిప్యూటీ సి‌ఎం తేజస్వి తాజాగా చెప్పుకొచ్చారు.

ఈ బేటీలో ప్రధానంగా విపక్షాల లీడర్ ఎంపికపైనే చర్చ ఉండనున్నట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.ఈ బేటీ తరువాత విపక్షాల కూటమిని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందట.పార్లమెంట్ ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో త్వరగా లీడర్ ఎంపిక చేపట్టి పక్కా వ్యూహరచనతో ముందుకు సాగాలని విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి.

మరి మోడిని గద్దె దించేందుకు ఏకమౌతున్న పార్టీలు లక్ష్యాన్ని ఎంతవరకు చేద్ధిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.మరోవైపు విపక్ష పార్టీలన్నీ ఏకం అయినప్పటికి వచ్చేది మళ్ళీ మోడి ప్రభుత్వమే అని బీజేపీ కాన్ఫిడెంట్ గా ఉంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

మరి బీజేపీ దగ్గర ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి ? విపక్షాలు ఎలా ఎదుర్కొబోతున్నాయనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు