సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక భాషలో హిట్ అయిన సినిమాలను వేరొక భాషలో మళ్ళీ రీమేక్ చేస్తూ ఉంటారు.ఇలా హిందీలో హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేయడం, లేదా తమిళ, కన్నడ భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తూ ఉంటారు.
ఇలా ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరొక భాషలో ఆ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు రీమేక్ చేస్తూ హిట్ కొడుతూ ఉంటారు.ఇలా తాజాగా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాని బాలీవుడ్ స్టార్ హీరో రీమేక్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ బాలీవుడ్ హీరో మీరెవరో కాదు రణవీర్ సింగ్.
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రణవీర్ సింగ్ ఇటీవల సర్కస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వారి అంచనాలను అందుకోలేకపోయింది.అందువల్ల ఈ సినిమాతో రణవీర్ చాలా నిరాశ చెందినట్లు తెలుస్తోంది.సర్కస్ సినిమా నిరాశపరచడంతో రణవీర్ టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమా రీమేక్ చేసి హిట్ అందుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది .ఇటీవల విడుదలైన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రవితేజకు మంచి కం బ్యాక్ ఇచ్చింది.ఇలా ఈ సినిమాని రీమేక్ చేసి హిందీలో మంచి హిట్ అందుకోవాలని రణవీర్ సింగ్ ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక క్రాక్ సినిమా హిందీ వర్షన్ కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.అయితే ప్రస్తుతం గోపీచంద్ మలినేని బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే గోపీచంద్ మలినేని నెక్స్ట్ తన సినిమాని రణవీర్ సింగ్ తో చేయనున్నాడా? లేక ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేస్తాడా ? అన్న విషయాల గురించి ఇంకా క్లారిటీ లేదు.అయితే క్రాక్ సినిమా రీమేక్ గురించి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.