జూనియర్ ఎన్టీయార్ హీరో గా వచ్చిన బృందావనం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా కాజల్, సమంత హీరోయిన్ లుగా నటించారు అయితే శ్రీహరి, ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా అన్నదమ్ములు గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక వీళ్ల కి నాన్న గా కోట శ్రీనివాసరావు( Kota srinivasa rao ) నటించారు.
కోట గారు చేసిన పాత్ర కోసం మొదట వేరే నటుడుని తీసుకుందాం అని డైరెక్టర్ అనుకున్నాడట కానీ చివరికి దిల్ రాజు సలహా మేరకు కోట గారినే తీసుకున్నారు అయితే ముందు డైరెక్టర్ వంశీ పైడిపల్లి ( Vamshi Paidipally )తీసుకుందాం అనుకున్న ఆ నటుడు ఎవరంటే కైకాల సత్య నారాయణ( Kaikala Satyanarayana ) గారు… ఈయనని తీసుకుందాం అని అనుకున్నప్పటికీ ఎందుకో దిల్ రాజు కి నచ్చలేదట అందుకే ఈయన్ని పక్కన పెట్టేసి కోట శ్రీనివాసరావు ని తీసుకున్నారు.ఇక కోట గారు కూడా ఈ పాత్ర లో చాలా అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు…
ఇక ఈ సినిమాలో చాలామంది నటులు కూడా సూపర్ గా నటించారు అలాగే ఎన్టీయార్ కెరియర్ లో ఇదొక మంచి హిట్ సినిమా గా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఎన్టీయార్ దేవర సినిమా చేస్తుంటే వంశీ పైడిపల్లి మాత్రం వారసుడు సినిమా ప్లాప్ అవ్వడం తో ఇప్పుడు ఏ సినిమా చేయలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
నిజానికి వంశీ( Vamshi Paidipally ) మంచి డైరెక్టర్ అయినా కూడా ఎందుకు ఈ అవుట్ డేటెడ్ స్టోరీస్ తో సినిమా చేస్తున్నాడో అర్థం కావటం లేదు.ఆయన కెరియర్ లో మంచి హిట్ సినిమాలు ఉన్నప్పటికీ ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాడో అర్థం కావటం లేదు.ఇప్పటికీ అయిన ఒక మంచి స్టోరీ ని తీసుకొని సినిమా చేస్తే బాగుంటుంది.