తెలంగాణలో ప్రస్తుతం ఒక ప్రశ్న అందరినీ వెంటాడుతోంది.ఒకవేళ వచ్చే ఎన్నికల్లో గెలిచి బిఆర్‌ఎస్( BRS ) మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు సిఎం బాధ్యతలు ఎవరు చేపడతారనేది.
ఎందుకంటే బిఆర్‌ఎస్ మళ్ళీ గెలిస్తే సిఎం గా మళ్ళీ కేసిఆరే ( KCR ) కొనసాగుతారా లేదా తనయుడు కేసిఆర్ ఆ బాధ్యతలను చేపడతారా అనే విషయం ఒక అంతు చిక్కని ప్రశ్నగా ఉంది.వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే సిఎం గా కేసిఆర్ పదవి చేపడతారని బిఆర్‌ఎస్ నేతలు పదే పదే చెబుతున్నారు.
అటు కేసిఆర్ కూడా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయడంతో ఇక రాష్ట్ర బాధ్యత అంత కేటిఆరే భుజాన వేసుకుంటారని తెలంగాణ ప్రజలంతా భావిస్తున్నారు.

అయితే నెక్స్ట్ సారి కూడా సిఎంగా కేసిఆరే ఉంటారని, హ్యాట్రిక్ సిఎం గా ఆయన చరిత్రలో నిలిచిపోతారని కేటిఆర్ ( KTR ) ఆ మద్య స్పష్టం చేశారు.దీంతో ఈ ప్రశ్నకు తెరపడినట్లైంది.అయితే తాజాగా శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేసిఆర్ డిల్లీ పై దృష్టి పెడితే తెలంగాణ సిఎం గా కేటిఆరే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.
దీంతో మళ్ళీ రాష్ట్రంలో సిఎం పదవిపై చర్చ జరుగుతోంది.ప్రస్తుతం కేసిఆర్ తెలంగాణపై కంటే జాతీయ రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు.ఇతర రాష్ట్రాలలో పర్యటనలు చేస్తూ పార్టీని విస్తరించే పనిలో నిమగ్నం అయి ఉన్నారు.

దాంతో రాష్ట్ర బిఆర్‌ఎస్ బాద్యతలు కేటిఆరే చూసుకుంటున్నారు.ఇప్పటికే కేటిఆర్ నాయకత్వానికి ప్రజల నుంచి అటు బిఆర్‌ఎస్ శ్రేణుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది.ఈ నేపథ్యంలో ఒకవేళ వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలిస్తే.
హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసిఆర్ బాధ్యతలు చేపట్టినప్పటికి.పాలన మాత్రం కేటిఆరే కొనసాగిస్తాననేది కొందరి అభిప్రాయం.
అంటే సిఎం గా పేరు కేసిఆర్ దే అయినప్పటికి, పదవి పాలన మొత్తం కేటిఆర్ చూసుకునే అవకాశాలు ఉన్నాయి.ఇక వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు పైగా విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న బిఆర్‌ఎస్ ఆ టార్గెట్ ను రిచ్ అవుతుందా ? లేదా ప్రతిపక్ష పార్టీలు షాక్ ఇస్తాయా అనేది చూడాలి.
