కోలీవుడ్ ( Kollywood )డైరెక్టర్ అట్లీ విజయ్ తో సినిమాలు చేసి స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ తో జవాన్ ( Jawan movie )సినిమా తీస్తున్నాడు.ఈ సినిమా నెక్స్ట్ మంత్ 7న రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా తర్వాత అట్లీ నెక్స్ట్ డైరెక్ట్ చేసే హీరో ఎవరన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.జవాన్ తర్వాత కూడా అట్లీ మరో బాలీవుడ్( Bollywood ) హీరోతో చేస్తాడని వార్తలు వస్తున్నాయి.
కానీ అట్లీ మాత్రం తమిళ హీరోతో ఒక పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడట.అయితే ఈ సినిమా తర్వాత మాత్రం తెలుగు హీరోతో అట్లీ సినిమా చేయాలని ప్లానింగ్ లో ఉన్నాడట.
తెలుగులో ఆల్రెడీ ఎన్.టి.ఆర్, ప్రభాస్ లతో అట్లీ టచ్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది.అయితే అట్లీ చేస్తానని చెప్పినా ప్రభాస్, తారక్ ఇద్దరు రెండు మూడేళ్ల దాకా వారి డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు.
అందుకే అట్లీ తమిళ హీరోతోనే సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.జవాన్ తో షారుఖ్ కి సౌత్ లో కూడా ఒక సూపర్ హిట్ ఇచ్చేలా అట్లీ( Atlee ) మెగా ప్లాన్ వేశాడు.
మరి ఈ సినిమా ఎంతవరకు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందో చూడాలి.








