విజయ్ దేవరకొండ, సమంత లీడ్ రోల్ లో శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఖుషి( khushi movie ) సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో విజయ్, సమంతల జోడీ ఆడియన్స్ కి స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుంది.
ఈ సినిమా ట్రైలర్ చూస్తే అంత కొత్తగా ఏం లేదు ప్రేమ, పెళ్లి ఆ తర్వాత గొడవలే అన్నట్టు చూపించారు.రొటీన్ కంటెంటే కదా అనుకునే ఛాన్స్ ఉంది కానీ అక్కడే శివ( Shiva Nirvana ) తన క్లవర్ నెస్ ని చూపించాడు.
ట్రైలర్ లో అంచనాలు లేకుండ వచ్చి సినిమా చూసి సర్ ప్రైజ్ చేయాలని అతని ప్లాన్ అట.

సినిమాలో విజయ్ సమంత( Samanth )ల మధ్య వచ్చే లవ్ సీన్స్ ప్రతి ప్రేమికుడిని టచ్ చేస్తాయని అంటున్నారు.అంతేకాదు మ్యూజిక్ కూడా సినిమాకు మరో హైలెట్ గా ఉంటుందని చెబుతున్నారు.సో ట్రైలర్ అలా ఉంది కాబట్టి ఖుషి పై నిరుత్సాహ పడకుండా సినిమా చూసిన వాళ్లు వావ్ అనేలా ఉంటుందని డైరెక్టర్ చెబుతున్నాడు.
ప్రమోషన్స్ లో కూడా ఇదే విషయాన్ని చెబుతూ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.ఈ సినిమాకు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించారని తెలిసిందే.







