తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హాస్యనటుడిగా అల్లు రామలింగయ్య ఇండస్ట్రీలో కొనసాగారు అనంతరం గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి ఆయన కుమారుడిని నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఈ విధంగా గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.తాజాగా అల్లు రామలింగయ్య జయంతి వేడుకలను పురస్కరించుకొని అల్లు అరవింద్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమం మొదటి భాగంలో అల్లు అరవింద్ ఎన్నో విషయాల గురించి ముచ్చటించారు.ఈ క్రమంలోనే రెండవ భాగంలో అల్లు అరవింద్ పాల్గొని మరికొన్ని విషయాలను తెలియచేశారు.
ఈ సందర్భంగా గీత ఆర్ట్స్ బ్యానర్ పేరు వెనుక ఉన్న అర్థం ఏంటి అసలు ఈ గీత అంటే ఎవరు అనే విషయాల గురించి కూడా అల్లు అరవింద్ ఈ సందర్భంగా తెలియజేశారు.గీతాఆర్ట్స్ అనే పేరు పెట్టింది తన తండ్రి అల్లు రామలింగయ్య అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ తెలియజేశారు.
భగవద్గీత సారాంశం నచ్చి నాన్న ఈ పేరు పెట్టినట్లు తెలిపారు.ప్రయత్నం మాత్రమే మనది ఫలితం మన చేతిలో ఉండదు ఈ పదం సినిమాలకు కరెక్ట్ గా సరిపోతుంది.
ఒక నిర్మాతగా మన పని మనం చేయడమే ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది.అందుకే తమ బ్యానర్ కు గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టినట్లు తెలిపారు.పెళ్లయిన తర్వాత నిర్మల ఆర్ట్స్ అని మీ భార్య పేరు పెట్టుకోవచ్చు కదా అంటూ అలీ ప్రశ్నించగా గీతాఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన ఎన్నో సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి అందుకే ఈ పేరు మార్చలేదు అంటూ సమాధానం చెప్పారు.అదేవిధంగా నేను చదువుకునే రోజుల్లో నాకు గీత అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేది, నా స్నేహితులందరూ నన్ను ఆటపట్టించేవారు అంటూ అల్లు అరవింద్ ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.