టీడీపీ కి గవర్నర్ పదవి ..  ఈ ముగ్గురిలో బాబు ఛాయిస్ ఎవరో ? 

ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టిడిపికి ( TDP )ఊహించిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు కేంద్ర బీజేపీ ( BJP )పెద్దలు ఇప్పటికే ఏపీకి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు , నిధుల విషయంలో సానుకూలంగా స్పందిస్తూ వస్తున్నారు.

టిడిపి కి కేంద్ర మంత్రి పదవులు లభించాయి ఇక అన్ని విషయాలలోను తాము సానుకూలమే అన్నట్లుగా బిజెపి పెద్దలు వ్యవహరిస్తున్నారు.

ముఖ్యంగా పోలవరం,  అమరావతి విషయంలో కేంద్రం సహకారం బాగానే లభిస్తోంది.ఇంకా అనేక విషయాల్లో సానుకూలంగా ఉంటుంది.

టిడిపి కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది.ఇదిలా ఉంటే .తాజాగా బిజెపి ముఖ్య నాయకత్వం నుంచి గవర్నర్ పదవి టిడిపికి ఆఫర్ వచ్చినట్లు సమాచారం.గవర్నర్ పదవిని చంద్రబాబు( Chandrababu ) సూచించిన వారికి కేటాయించేందుకు కేంద్ర బిజెపి పెద్దలు సానుకూలంగా ఉన్నారట.

దీంతో టీడీపీ నుంచి ఎవరి పేరును చంద్రబాబు సూచిస్తారనేది ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే గవర్నర్ విషయంలో చంద్రబాబుపై ఆ పార్టీ నాయకులు నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది.ఈ పదవి కోసం చాలామంది పోటీ పడుతున్నారు.

Advertisement

దీంతో చంద్రబాబు ఎవరి పేరును ఫైనల్ చేస్తారనేది ఎవరికి అంతు పట్టడం లేదు.ప్రస్తుతం కేంద్రం కొత్త గవర్నర్ల నియామకం పైన దష్టి పెట్టింది.

టిడిపి నుంచి గవర్నర్ పదవికి ఒకరిని ఎంపిక చేయబోతున్నారు.ఈ రేసులో ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

చంద్రబాబు దృష్టిలో ఉన్న సీనియర్ నేతలు పూసపాటి అశోక్ గజపతిరాజు( Pusapati Ashok Gajapathiraju ),  యనమల రామకృష్ణుడు  మరో సీనియర్ నేత వర్ల రామయ్య పేర్లు వినిపిస్తున్నాయి.ఈ ముగ్గురిలో ఒకరి పేరును ఫైనల్ చేసే అవకాశం ఉంది అశోక్ గజపతిరాజు,  యనమాల రామకృష్ణుడు ముందు నుంచి టిడిపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు.

చంద్రబాబుకు అన్ని విషయాల్లోనూ అండదండలు అందిస్తూ వచ్చారు.అశోక్ గజపతిరాజు కేంద్రంలోనూ టిడిపి తరఫును మంత్రిగా పనిచేశారు. 

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

ప్రస్తుతం ఇద్దరు నేతలు మొన్నటి ఎన్నికలకు దూరంగానే ఉన్నారు.అశోక్ గజపతిరాజుకు, గవర్నర్ పదవి ఇస్తే యనమల రామకృష్ణుడుకు గవర్నర్ గా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది .అయితే గతంలో రాజ్యసభ అభ్యర్థుల ఖరారు విషయంలో చివర వరకు వర్ల రామయ్య పేరు వినిపించడం,  ఆ తర్వాత మరొకరికి ఆ అవకాశం దక్కడంతో గతంలోనే గవర్నర్ పదవి విషయంలో వర్ల రామయ్యకు చంద్రబాబు హామీ ఇచ్చారు.  దీంతో ఇప్పుడు ఈ ముగ్గురు నేతల పేర్లను పరిశీలిస్తున్నారట.

Advertisement

వీరిలో ఒకరి పేరు ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది.సామాజిక వర్గాల దృష్ట్యా , బీసీ లేదా ఎస్సీ సమాజిక వర్గాలకు గవర్నర్ పదవి విషయంలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉండడంతో,  యనమల లేదా వర్లకు అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.

అయితే అశోక్ గజపతిరాజు అందరికీ ఆమోదయ యోగ్యమైన నేత కావడంతో,  ఆయన పేరు గట్టిగానే వినిపిస్తుంది .ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది తేలాల్సి ఉంది.

తాజా వార్తలు